కొందరు మనుషులు చిన్న విషయాలకు కంట్రోల్ తప్పిపోతున్నారు. సిల్లీ రిజన్స్ కు ఎమోషనల్ అవుతున్నారు. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సార్లు.. ఇది కొట్టుకొవడం, హద్దులు దాటి చంపుకొవడం వరకు వెళ్తున్నాయి. కొంత మంది భార్తలు.. భార్య చికెన్ వండలేదని, సరిగ్గా మాట్లాడలేదని , పట్టించుకొవడం లేదని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ఢిల్లీలో (Delhi) దారుణమైన ఘటన జరిగింది. సుల్తాన్ పూర్ లో ఈ ఘటన జూన్ 17 న జరిగింది. వినోద్ కుమార్ దూబే (47), సోనియా దూబే భార్య భర్తలు. వీరు ప్రతి రోజు మద్యం తాగేవారు. కొన్నిసార్లు వీరి మధ్య తాగిన మైకంలో గొడవలు జరిగేవి. ఒక రోజు వీరు పీకల దాక తాగారు. మద్యం మత్తులో భార్యను అన్నం పెట్టమని వినోద్ కుమార్ దూబే కోరాడు. దీనికి భార్య నిరాకరించింది.
దీంతో అతను కంట్రోల్ తప్పాడు. భార్యను మద్యం మత్తులోనే దిండుతో గాలి ఆడకుండా చేసి, ఆమె పక్కనే పడుకున్నాడు. ఆ తర్వాత.. ఉదయం మెళకువ వచ్చాక.. భార్య చనిపోయిందని తెలిసి షాక్ అయ్యాడు. వెంటనే ఇంట్లోని నలభై వేల రూపాయలను తీసుకుని పారిపోయాడు. ఈ క్రమంలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రత్యేకంగా పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని గాలించి పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో దారుణం జరిగింది.
ఢిల్లీలోని మయూర్ విహార్(Mayur Vihar)లో 30 ఏళ్ల మహిళను... అత్తింటివారు బిల్డింగ్ టెర్రస్(Building Terrace)పై నుంచి తోసేశారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 3.00 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. బిల్డింగ్ టెర్రస్ పై నుంచి కింద రోడ్డుపై పడిపోయిన మహిళ(Woman)ను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను దగ్గర్లోని మాక్స్ హాస్పిటల్ కి తరలించారు. ఆ మహిళకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం... బాధితురాలు రచనకు 3 సంవత్సరాల క్రితం మయూర్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రిలోక్‌పురి నివాసి పునీత్ ఉంట్వాల్తో వివాహం జరిగింది.
తన సోదరిని అత్తింటి వారు బిల్డింగ్ టెర్రస్ నుంచి కిందకు తోసివేశారని బాధితురాలు రచన సోదరుడు ఆరోపించాడు. తన సోదరిని ఆమె బావ, ఆయన భార్య బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియోతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఢిల్లీ మహిళా కమిషన్‌కు కూడా ఈ వీడియోను పంపాడు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసినట్లు ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం, మెడికో లీగల్ కేసు (MLC) మరియు ఈ వ్యవహారంపై ఇప్పటివరకు జరిపిన విచారణల ఆధారంగా పోలీసులు సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద బాధిత మహిళ అత్తింటివారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు జిల్లా) ప్రియాంక కశ్యప్ తెలిపారు. విచారణ ప్రస్తుతం జరుగుతోందని ఆమె తెలిపారు.
,
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brutally murder, Crime news, Delhi, Harassment