Home /News /crime /

DELHI MAN KILLS WIFE CALLS MOTHER IN LAW TO CONFESS SHE TAKES IT LIGHTLY BA

నీ కూతుర్ని చంపేస్తున్నా అని అల్లుడు ఫోన్ చేస్తే.. నిద్రపోయిన అత్త

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తన భార్య సీమా మరో వ్యక్తితో లైంగిక సంబంధం నెరుపుతోందని అనుమానం వచ్చిన భర్త ఆశు.. ఆమెను హత్య చేయాలని భావించాడు.

    ‘అత్తా.. కాసేపట్లో మీ అమ్మాయిని చంపేస్తున్నా.’ అని అల్లుడు ఫోన్ చేసి బెదిరిస్తే.. ఏ తల్లయినా ఏం చేస్తుంది? కంగారు పడుతుంది. భయపడుతుంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేయడమో, లేకపోతే పక్కింటి వారికి చెప్పడమో, కుదిరితే అల్లుడి ఇంటి వద్దకు అర్జంట్‌గా వెళ్లడమో చేస్తుంది. కానీ, ఆ అత్తమాత్రం ‘సరే’ అని సమాధానం చెప్పి నిద్రపోయింది. అయితే, ఈ ఘటన ఒక్కసారి కాదు. రెండు సార్లు జరిగింది. రెండుసార్లూ అల్లుడు ఫోన్ చేసి కూతుర్ని చంపేస్తున్న విషయం చెప్పగానే, ఫోన్ పెట్టేసి నిద్రపోయింది. న్యూఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఆశు, సీమా భార్యాభర్తలు. తన భార్య సీమా మరో వ్యక్తితో లైంగిక సంబంధం నెరుపుతోందని అనుమానం వచ్చిన భర్త ఆశు.. ఆమెను హత్య చేయాలని భావించాడు. ఈ విషయాన్ని అత్తకు కూడా ఫోన్ చేసి చెప్పాడు. అత్త నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో ఆమెను క్రూరంగా చంపేశాడు. ఆ తర్వాత తీరిగ్గా వెళ్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు.

    అయితే, పోలీసుల విచారణలో మరో షాకింగ్ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఆశు తన భార్యను చంపడానికి అతడి సోదరుడు కూడా సాయం చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ కలసి ఆమె శవాన్ని ముక్కలు చేసి తీసుకుని వెళ్లి డ్రైనేజీలో పడేశారు. తాను తన భార్యను హత్య చేశానంటూ ఆశు పోలీసుల ఎదుట లొంగిపోగానే పోలీసులు వెళ్లి వారి ఇంట్లో తనిఖీ చేశారు. అక్కడ వారికి ఓ సెల్ ఫోన్ దొరికింది. ఆ సెల్ ఫోన్‌లో ఫోన్ కాల్స్ లిస్ట్ చెక్ చేయగా, అత్తగారికి ఫోన్ చేసిన విషయం పోలీసులకు తెలిసింది. అయితే, తాను ఫోన్ చేసినా కూడా అత్త పట్టించుకోలేదని చెప్పాడు. అయితే, తాను నిద్రపోయానని పోలీసులకు ఆ అత్త చెప్పడం విశేషం.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Crime, New Delhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు