Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /క్రైమ్ /

బాత్రూమ్ లో తల్లిని చంపి.. 77 పేజీలో నోట్.. హల్ లో కొడుకు ఆత్మహత్య.. కారణం ఏంటంటే..

బాత్రూమ్ లో తల్లిని చంపి.. 77 పేజీలో నోట్.. హల్ లో కొడుకు ఆత్మహత్య.. కారణం ఏంటంటే..

విచారణ చేపట్టిన అధికారులు

విచారణ చేపట్టిన అధికారులు

Delhi: మూడు రోజుల నుంచి ఆ ఏరియాలో ఉన్న ఇంట్లో నుంచి ఎవరు బయటకు రావడంలేదు. కానీ ఆ ఇల్లు ఉన్న ప్రాంతం నుంచి మాత్రం.. భరించలేని దుర్వాసన వస్తుంది. దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

కొంత మంది ప్రతిచిన్న విషయాలకు తమ డిప్రెషల్ కు లోనవుతారు. ఎగ్జామ్ బాగా రాయలేదని, ఇంట్లో వారు తిట్టారని, సరైన ఉద్యోగం రాలేదని కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు. అదే విధంగా.. ఇంకొందరు.. లవ్ లో ఫెయిల్ అయ్యామని, ప్రేయసీకి వేరే అబ్బాయితో పెళ్లి జరిగిందని ప్రతిదాన్ని చాలా డీప్ గా ఆలోచిస్తుంటారు. దీంతో పిచ్చి ఆలోచనలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఇంట్లో గదిలోకి వెళ్లి ఉరివేసుకుని, మరికొందరు రైలు కిందపడి తమ ప్రాణాలు తీసుకుంటారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు వార్తలలో నిలుస్తున్నాయి. తాజాగా, ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. న్యూఢిల్లీలోని (Delhi) రోహిణి ప్రాంతంలో విషాదరక సంఘటన జరిగింది. 25 ఏళ్ల యువకుడు క్షితిజ్ .. తన తల్లి మిథిలేష్ తో కలిసి ఉంటున్నాడు. యువకుడి తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. అయితే.. అతను కొన్ని రోజుల నుంచి డిప్రెషన్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలో తన తల్లిని బాత్రూమ్ లో అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత.. అతను కూడా 77 పేజీల సూసైడ్ నోట్ రాసి తన జీవితం కూడా ముగించాడు. అయితే.. కొన్నిరోజుల నుంచి వీరి ఇంటి నుంచి ఎవరు బయటకు రాకపోవడాన్ని చుట్టుపక్కల వారు గమనించారు.

అదే సమయంలో వీరి ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది. దీంతో వారంతా ... పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాల్కనీ నుంచి లోపలోకి ప్రవేశించారు. అప్పుడు షాకింగ్ కు గురయ్యారు. హల్ లో యువకుడు.. రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. అతని తల్లి.. బాత్రూమ్ లో కుళ్లిన స్థితిలో ఉంది. దీంతో ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. అక్కడ ఉన్న 77 పేజీల సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఒక మైనర్ బాలుడు, బాలికను నమ్మించి రోజు పొదల్లోకి తీసుకెళ్లేవాడు.

తమిళనాడులో (Tamil nadu) విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కడలూరు జిల్లాలో జరిగిన ఘటన తీవ్ర దుమారంగా మారింది. స్థానికంగా ఉన్న 11 వ తరగతి బాలికను అదే పాఠశాలకు చెంది, మరో మైనర్ బాలుడు ట్రాప్ చేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. పలు మార్లు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది.  అయితే.. బాలిక స్కూల్ లో వెయిటింగ్ రూమ్ కు వెళ్లింది. అక్కడ.. మగ బిడ్డను ప్రసవించింది. ఆ తర్వాత.. బాలిక మృతదేహాన్ని పాఠశాల వెనుక ఉన్న చెట్ల పొదల్లో పాడేసింది. కొంత మంది విద్యార్థులు.. స్కూల్ పొదల్లో చనిపోయిన శిశువు మృతదేహాం ఉండటం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆరాతీశారు. బాలికను, అదే స్కూల్ కు చెందిన బాలుడు అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడినిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి, జువైనల్ కోర్టుకు తరలించారు. బాలికను చికిత్స కోసం కామరాజ్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

First published:

Tags: Crime news, Delhi

ఉత్తమ కథలు