హోమ్ /వార్తలు /crime /

బాలికల్ని కిడ్నాప్ చేసి తన కోరిక తీర్చమంటున్నాడు... ఆ కోరిక ఏంటంటే...

బాలికల్ని కిడ్నాప్ చేసి తన కోరిక తీర్చమంటున్నాడు... ఆ కోరిక ఏంటంటే...

Delhi Crime : దేశ రాజధాని ఢిల్లీలో రకరకాల క్రైమ్స్ జరుగుతున్నాయి. వాటిలో ఓ కేసు మాత్రం పోలీసులకు సవాల్ విసిరింది. ఇప్పటివరకూ రెండు కిడ్నాపులు జరిగాయి. ఎవరు చేస్తున్నారో ఆధారాలు దొరికాయి. ఆ తర్వాత కేసులో ట్విస్ట్ పోలీసుల్ని షాకయ్యేలా చేసింది.

ఇంకా చదవండి ...

    ఢిల్లీ పోలీసులు 40 ఏళ్ల కృష్ణదత్ తివారీని అరెస్టు చేశారు. టాక్సీ నడుపుతున్న అతను రెండు నెలల కాలంలో ఇద్దరు మైనర్ బాలికల్ని కిడ్నాప్ చేశాడు. అతనికి ఇద్దరు కొడుకులు. ఒకరి ఏజ్ 12 ఏళ్లు, మరొకరికి 14 ఏళ్లు. రెండు నెలల కిందట 8 నెలల ఓ బాలిక మిస్సింగ్ అయ్యింది. ఏమైపోయిందో, ఎవరు ఎత్తుకెళ్లారో పోలీసులకు అర్థం కాలేదు. రెండు వారాల కిందట మరో బాలిక మిస్సింగ్ అయ్యింది. తన వయసు కూడా 8 ఏళ్లే. ఈ కేసుల్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు... ఓ చోట సీసీటీవీ ఫుటేజ్‌లో ఆధారాలు కనిపించాయి. పబ్లిక్ టాయిలెట్‌ నుంచీ బయటకు వస్తున్న బాలికను కారులో ఎత్తుకుపోయాడు కృష్ణదత్. కారు నెంబర్ ఆధారంగా... అతని అడ్రెస్ కనిపెట్టిన పోలీసులు... హడావుడిగా అతని ఇంటికి వెళ్లి చూశారు. షాకయ్యారు.

    కిడ్నాప్ అయిన ఇద్దరు బాలికలూ ఆ ఇంట్లో కనిపించారు. వాళ్లు ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉన్నారు. వాళ్లకు ఎలాంటి హానీ తలపెట్టకుండా చక్కగా చూసుకుంటున్నాడు కృష్ణదత్. ఆశ్చర్యపోయిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి, బాలికల్ని తమ తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంటరాగేషన్‌లో ఎందుకు కిడ్నాప్ చేశావ్ అని అడిగితే... కృష్ణదత్ చెప్పిన విషయం పోలీసుల్ని షాకయ్యేలా చేసింది.

    ఇద్దరు కొడుకులున్న కృష్ణకాంత్ భార్య చనిపోయింది. కృష్ణకాంత్‌కి కూతుర్ని పెంచుకోవాలనే ఆశ ఉంది. అందుకోసం ఏ అనాథ పాపనో దత్తత తీసుకోవచ్చు. అలా వద్దనుకున్న అతడు కన్నింగ్ ఐడియా వేశాడు. మైనర్ బాలికల్ని కిడ్నాప్ చేసి... తనతోపాటూ ఉండిపోమని రోజూ అడగసాగాడు. తనను తండ్రిలా భావిస్తే డబ్బు ఇస్తాననీ, చాక్లెట్లు ఇస్తాననీ ఆశలు రేపాడు. కాదంటే చంపేస్తానని బెదిరించాడు. అతన్ని ఎదిరిస్తే చంపేస్తాడేమోనన్న భయంతో ఆ బాలికలు... అక్కడే ఉండిపోయారు.

    బాలికలకు ఎలాంటి హానీ తలపెట్టలేదన్న పోలీసులు... అతని ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. సమాజంలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటున్నారనీ, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని సూచిస్తున్నారు.

    Photos: పెళ్లిచూపులు బ్యూటీ రితూవర్మ లేటెస్ట్ ఫోటోస్..

    First published:

    ఉత్తమ కథలు