గాలిపటం ఎగిరింది... గొంతు తెగింది... యువకుడి ప్రాణం పోయింది...

గాలిపటాల దారాల వల్ల పక్షుల ప్రాణాలు పోవడం వింటూ ఉన్నాం. అలాంటిది ఢిల్లీలో ఓ యువకుడి ప్రాణాలు కూడా పోవడానికి గాలిపటం దారమే కారణమైంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 17, 2019, 9:56 AM IST
గాలిపటం ఎగిరింది... గొంతు తెగింది... యువకుడి ప్రాణం పోయింది...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Delhi : ఢిల్లీ నివాసి అయిన 28 ఏళ్ల మానవ్ శర్మ గురువారం సాయంత్రం చనిపోయాడు. రక్షా బంధన్ వేడుక తర్వాత ఇద్దరు చెల్లెళ్లతో బంధువు ఇంటికి వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. పశ్చిమ విహార్ ఫ్లైఓవర్ దగ్గర్లో మానవ్ శర్మ తన బైక్ నడుపుతూ వెళ్తున్నాడు. వెనకాల ఇద్దరు చెల్లెళ్లూ కూర్చున్నారు. ఇంతలో... ఓ యువకుడు చైనీస్ గాలిపటాన్ని ఎగరేస్తున్నాడు. ఆ గాలిపటం దారం... ప్రత్యేక గాజు పొడితో తయారైనది. ఉన్నట్టుండి గాలిపటం దారం తెగింది. అది ఎగురుకుంటూ... వెళ్లి... ఓ చెట్టులో చిక్కుకుంది. ఐతే... గాలిపటం దారం... గాల్లో తేలుతూ... నేలపై జారుతోంది. అదే సమయంలో... బైక్‌పై వెళ్తున్న మానవ్ శర్మ మెడకు గాలిపటం మాంజా చుట్టుకుంది. వెంటనే చెట్టుపై ఉన్న గాలిపటం... మరింత టైట్ అయ్యింది. దాంతో... దారం మెడ దగ్గర సర్రున కోసుకుంటూ వెళ్లిపోయింది. రక్తం బొటబొటా కారింది.

షాకైన ఇద్దరు చెల్లెళ్లూ... ఏడుస్తూ గట్టిగా కేకలు వేశారు. చుట్టుపక్కల జనం అప్రమత్తమై... వెంటనే మానవ్ శర్మను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కానీ... గాలిపటం దారం అతని శ్వాసనాళాన్ని కూడా కోసేసింది. దాంతో... మానవ్ శర్మ... ఆస్పత్రిలో ప్రాణాలు విడిచాడు.

బుద్ధ విహార్‌లో ఉంటున్న మానవ్ శర్మ... ఒక ప్రైవేట్ కంపెనీలో సివిల్ ఇంజినీర్. పోలీసులు కేసు నమోదు చేశారు. అతను చనిపోయిన రోజున చైనా మాంజాకి సంబంధించి పోలీసులకు 15 కంప్లైంట్లు వచ్చాయి.

అంతకుముందు కూడా ఢిల్లీకి చెందిన ఓ యువకుడు ఇదే తరహాలో మరణించాడు. గాజు పూతతో కూడిన వస్తువుల్ని కలిగి ఉన్న చైనీస్ కిట్లను కొనడం, అమ్మడం, ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు నిషేధించినా... ఇప్పటికీ చైనా మాంజాలు బ్లాక్ మార్కెట్లలో అమ్ముడవుతూనే ఉండటం మన దురదృష్టం.

First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు