భార్యతో బంధువు గూడు పుఠాణి.. అలా కనిపెట్టి హత్య చేశాడు..

ఇద్దరు బంధువులు కావడంతో ఒకరి ఇంటికి ఒకరు వస్తూ పోతుండేవారు. కానీ అహ్మద్ తీరుపై ఆలమ్‌కి ఎక్కడో చిన్న అనుమానం మొదలైంది. భార్య ప్రవర్తనలోనూ తేడా గమనించాడు.

news18-telugu
Updated: August 8, 2019, 8:31 AM IST
భార్యతో బంధువు గూడు పుఠాణి.. అలా కనిపెట్టి హత్య చేశాడు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆలమ్ ఓ కంపెనీలో కొన్నేళ్ల నుంచి మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో అతని బంధువు అహ్మద్(31) కూడా పనిచేస్తున్నాడు.ఇద్దరూ బంధువులు కావడం.. పైగా ఒకే చోట పనిచేస్తుండటంతో.. ఒకరి ఇంటికి ఒకరు తరుచూ వెళ్తుండేవారు. కానీ ఆలమ్‌కు ఎక్కడో తేడా కొట్టింది.అహ్మద్‌పై ఎక్కడో చిన్న అనుమానం.. పనికి వెళ్లినా అదే అనుమానం వెంటాడేది. తన భార్యతో అహ్మద్ రహస్యంగా ఏదో గూడు పుఠాణి నడిపిస్తున్నాడన్న అనుమానం రోజురోజుకు బలపడింది. భార్య సెల్‌ఫోన్‌లో రహస్యంగా ఓ యాప్ డౌన్‌లోడ్ చేసి.. ఆమె కాల్స్ అన్నీ ట్రాక్ చేశాడు. అహ్మద్‌తో ఆమెకు ఆ సంబంధం ఉందని నిర్దారించుకున్నాడు.చివరకు అహ్మద్‌ను హత్య చేసి హంతకుడిగా మారాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఆలమ్,అహ్మద్ ఇద్దరూ స్థానికంగా ఓ కంపెనీలో మెకానిక్స్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు బంధువులు కావడంతో ఒకరి ఇంటికి ఒకరు వస్తూ పోతుండేవారు. కానీ అహ్మద్ తీరుపై ఆలమ్‌కి ఎక్కడో చిన్న అనుమానం మొదలైంది. భార్య ప్రవర్తనలోనూ తేడా గమనించాడు.ఇద్దరిపై నిఘా పెట్టాలనుకున్నాడు. భార్యకు తెలియకుండా ఆమె సెల్‌ఫోన్‌లో ఒక యాప్ డౌన్‌లోడ్ చేశాడు. ఆ యాప్‌తో ఆమె ఫోన్ కాల్ సంభాషణలను ట్రాక్ చేశాడు.అహ్మద్-ఆలమ్ మధ్య ఆ సంబంధం నిజమే అని తేలింది. దీంతో ఆవేశంతో రగిలిపోయిన అహ్మద్ ఆలమ్‌పై పగ తీర్చుకోవాలనుకున్నాడు.

బుధవారం పని ప్రదేశంలో ఆలమ్ అహ్మద్‌పై దాడికి పాల్పడ్డాడు. దుడ్డుకర్రతో అతని తలపై తీవ్రంగా గాయపరిచాడు. ఆపై ఏమీ ఎరగనట్టు..ఆఫీస్ స్టాఫ్‌కు ఫిర్యాదు చేశాడు. కరెంట్ షాక్ వల్ల అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడని వాళ్లతో చెప్పాడు. హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందాడు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో అహ్మద్ కరెంట్ షాక్ వల్ల చనిపోలేదని.. బలమైన గాయాల వల్లే చనిపోయాడని తెలిసింది.దీంతో ఆలమ్‌ను పోలీసులు గట్టిగా నిలదీయగా అసలు విషయం బయటపెట్టాడు. తన భార్యతో సంబంధం పెట్టుకోవడం వల్లే హత్య చేశానని అంగీకరించాడు.దీంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

First published: August 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు