హోమ్ /వార్తలు /క్రైమ్ /

అమానవీయం.. పక్కింటి యజమాని, పెంపుడు కుక్క పై ఇనుప రాడ్ తో దాడి.. వీడియో వైరల్..

అమానవీయం.. పక్కింటి యజమాని, పెంపుడు కుక్క పై ఇనుప రాడ్ తో దాడి.. వీడియో వైరల్..

పక్కింటి కుక్కపై రాడ్ తో దాడి

పక్కింటి కుక్కపై రాడ్ తో దాడి

Delhi: ధరమ్ వీర్ అనే వ్యక్తి వాకింగ్ చేసుకుని ఇంటికి వస్తున్నాడు. ఇంటి పక్కన ఉండే పెంపుడు కుక్క అతడిని చూసి మోరిగింది. దీంతో అతను అసహనంతో ఊగిపోయాడు.

కొంత మంది తమ ఇంట్లో కుక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. అవి దొంగల నుంచి, కొత్తమనుషులు ఇంట్లోకి రాకుండా తమ వాళ్లకు, ఇంటికి సెక్యురిటీ ఇస్తాయి. ఎవరు కొత్తవారు కన్పించిన అరవడం కుక్క అలవాటు. అయితే, కొన్నిసార్లు.. కుక్కలు అరుస్తుండంటం వలన, పక్కన ఉన్న ఇళ్లవారు ఇబ్బందులకు గురౌతారు. మరికొన్ని సార్లు.. కుక్కలు పొరుగింటి వారిని, వాకింగ్ చేస్తున్న వారిని సైతం కరవడం, దాడులు చేయడం మనకు తెలిసిందే.

దీంతో కొన్ని సార్లు.. కుక్క మూలంగా కూడా చుట్టు పక్కల వారితో వాగ్వాదాలు, గొడవలు జరుగుతాయి. కొన్నిసార్లు ఇవి హత్యలు చేసుకొవడం వరకు కూడా వెళ్లిన అనేక సంఘటనలు గతంలో వార్తలలో ఉన్నాయి. తాజాగా, ఈ కోవకు చెందిన మరోక ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీలో (Delhi) అమానుష సంఘటన జరిగింది. పశ్చిమ్‌ విహార్‌లో ఈ ఘటన సంభవించింది. రక్షిత్, ధరమ్‌వీర్ దహియా అనే వ్యక్తులు ఒకే ఏరియాలో ఉంటారు. అయితే, రక్షిత్ ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే, ప్రతిరోజు అది అరుస్తూ ధరమ్ వీర్ కు ఇబ్బంది కలిగించేది. కొన్ని రోజుల పాటు భరించాడు. ఈ క్రమంలో ధరమ్ వీర్ వాకింగ్ వెళ్లి వస్తుండగా.. కుక్క అతడిని (Barking Hits Dog) కరిచింది.వెంటనే అతను ఇంటికి వెళ్లి ఒక ఇనుప రాడ్ ను తీసుకొచ్చాడు. రక్షిత్ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

రక్షిత్, అతని కుక్కపై రాడ్ తో బలంగా కొట్టాడు. దెబ్బకు ఇద్దరు కూడా నెలమీద పడ్డారు. అయితే, మరో మహిళ ధరమ్ వీర్ ను ఆపడానికి ప్రయత్నించింది. అతనిపై కూడా ధరమ్ వీర్ దాడిచేశాడు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు (viral video)  అయ్యింది. స్థానికులు.. వెంటనే రక్షిత్ , మరో మహిళను ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా కుక్క కరిచిందని ధరమ్ వీర్ కూడా ఆస్పత్రికి వెళ్లాడు. పాపం.. కుక్క తలకు కూడా రక్తం గడ్డ కట్టింది. దాన్ని వెటర్నరీ వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వారంతా పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది. ఈ గొడవ కు సంబంధించిన  వీడియో ప్రస్తుతం.. సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా  మారింది.

First published:

Tags: Crime news, Delhi, Pet dog, Viral Video

ఉత్తమ కథలు