Congress-Hathras: బట్టలు చించేశారు..యూపీ ఖాకీలపై కాంగ్రెస్ మహిళా నేత సంచలన ఆరోపణలు

Congress-Hathras: ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమ్రితా ధావన్ యూపీ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. హత్రాస్ బాధితులను కలవడానికి వెళ్తున్ సందర్భంగా జరిగిన ఆందోళనలో తన బట్టలు చింపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: October 2, 2020, 1:38 PM IST
Congress-Hathras: బట్టలు చించేశారు..యూపీ ఖాకీలపై కాంగ్రెస్ మహిళా నేత సంచలన ఆరోపణలు
Photo: twitter
  • Share this:
హత్రాస్ ఘటనపై దేశం అట్టుడుకుతున్న వేళ.. ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమ్రితా ధావన్ యూపీ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. వారు తన బట్టలు చించేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న హత్రాస్ లో గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి ప్రియాంకా గాంధీ, రాహూల్ గాంధీతో కలిసి అమ్రిత బయలుదేరారు. ఆ సమయంలో వీరి పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యూపీ పోలీసులు, కాంగ్రెస్ నేతలకు నడుమ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో తన చీర చిరిగిపోయిందని అమ్రిత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే స్థానిక పోలీసులు మాత్రం అమ్రిత ఆరోపణలు సరికావన్నారు. నోయిడా మహిళా రక్షణ విభాగం డీసీపీ వ్రిందా శుక్లా ఈ అంశంపై ట్వీట్ చేశారు. ఆ ఆందోళన జరిగిన సమయంలో తనతో పాటు అనేక మంది మహిళా పోలీసులు అక్కడే విధులు నిర్వహించామన్నారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లే ఎలాంటి ఘటన అక్కడ జరగలేదని ఆమె అన్నారు.



యూపీలోని హత్రాస్ బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న తన మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారని, పోలీసులు కింద పడేశారని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిన్న ఆరోపించారు ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ బాధితురాలు చనిపోయింది. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఢిల్లీ నుంచి యూపీ బయలుదేరారు. అయితే, వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారి వాహనాలను నిలిపివేశారు. హత్రాస్‌లో 144 సెక్షన్ అమల్లో ఉందని, అలాగే, ప్రస్తుతం పాండమిక్ యాక్ట్ (కరోనా వైరస్ మహమ్మారి కారణంగా) అమల్లో ఉందని, ఈ సమయంలో గుంపులు, గుంపులుగా వెళ్లడానికి వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు.

రాహుల్, ప్రియాంకా గాంధీ వాద్రాలను అడ్డుకున్నారు. దీంతో వారిద్దరూ కారు దిగి నడక ప్రారంభించారు. తాను ఒక్కడినే నడుచుకుంటూ వెళ్తానంటూ రాహుల్ గాంధీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యూపీ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘పోలీసులు నన్ను తోసేశారు. లాఠీచార్జీ చేశారు. కింద పడేశారు. ఈ దేశంలో మోదీ ఒక్కరే నడవాలా? మామూలు మనుషులు నడవడానికి వీల్లేదా? మా వాహనాలను ఆపేశారు. దీంతో మేం నడక ప్రారంభించాం.’ అని యమునా ఎక్స్ ప్రెస్ వే మీద రాహుల్ గాంధీ కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. ఈ ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా మరో 200 మంది పార్టీ కార్యకర్తలపై ది ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక దూరం పాటించలేదని, మాస్కులు ధరించలేదని పలు అభియోగాలను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
Published by: Nikhil Kumar S
First published: October 2, 2020, 1:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading