హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఢిల్లీ లిక్కర్ స్కాం..అమిత్ అరోరాకు బిగుస్తున్న ఉచ్చు..మరో వారం కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం..అమిత్ అరోరాకు బిగుస్తున్న ఉచ్చు..మరో వారం కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం

ఢిల్లీ లిక్కర్ స్కాం

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అమిత్ అరోరా (Amith Arora) కు ఉచ్చు బిగుస్తుంది. నేటితో అమిత్ అరోరా (Amith Arora) కస్టడీ ముగియగా..సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. మరో వారం రోజుల పాటు అమిత్ అరోరా (Amith Arora) కస్టడీని పొడిగించాలని అధికారులు కోరారు. అధికారుల అభ్యర్ధనను పరిగణలోకి తీసుకున్న కోర్టు మరో వారం రోజుల పాటు అమిత్ అరోరా (Amith Arora) కస్టడీని పొడిగించింది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అమిత్ అరోరా (Amith Arora) కు ఉచ్చు బిగుస్తుంది. నేటితో అమిత్ అరోరా (Amith Arora) కస్టడీ ముగియగా..సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. మరో వారం రోజుల పాటు అమిత్ అరోరా (Amith Arora) కస్టడీని పొడిగించాలని అధికారులు కోరారు. అధికారుల అభ్యర్ధనను పరిగణలోకి తీసుకున్న కోర్టు మరో వారం రోజుల పాటు అమిత్ అరోరా (Amith Arora) కస్టడీని పొడిగించింది.

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు..విజయం దిశగా ఆప్ ..కనిపించని లిక్కర్ స్కాం ప్రభావం

డిసెంబర్ 5న అమిత్ అరెస్ట్..

ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరా (Amith Arora)ను డిసెంబర్ 5న ఈడీ (Enforcement Directorate) అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ (Amith Arora) సన్నిహితుడిగా తెలుస్తుంది. ఇక ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా (Amith Arora) కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. కాగా అమిత్ (Amith Arora) బడ్జీ ప్రైవేట్ కంపెనీ యజమానిగా ఉన్నాడు. ఇక సీబీఐ, ఈడీ FIRలో అమిత్ అరోరా  (Amith Arora) 9వ నిందితునిగా ఉన్నాడు. లిక్కర్ స్కాంలో అమిత్ అరోరా (Amith Arora) ను విచారించిన ఈడీ అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు.

Andhra Pradesh: అన్న‌వ‌రంపై విజిలెన్స్ వెన‌క జ‌రిగిందేంటి..?  లెక్క త‌ప్పిందెవ‌రు..?

వారి కస్టడీ పొడిగింపు..

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో శరత్ చంద్రా రెడ్డి (Sharath Chandhra Reddy), బినోయ్ బాబు (Binoy Babu)ల జ్యుడిషియల్ కస్టడీని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల పొడిగించింది. వారి జ్యుడిషియల్ రిమాండ్ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో నిన్న హాజరుపరిచారు. దీనిపై వాదనలు విన్న కోర్టు డిసెంబర్ 19 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించింది. ఇక బెయిల్ మంజూరు కోసం శరత్ చంద్రారెడ్డి రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై డిసెంబర్ 13న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది.

మరోవైపు ఈ కేసులో సీబీఐ 10 వేల పేజీలతో, ఈడీ 3 వేల పేజిలతో కూడిన తొలి ఛార్జ్ షీట్ ను కోర్టు ముందు ఉంచారు. ఈ కేసులో సీబీఐ ఏడుగురిపై అభియోగాలు మోపినట్లు తెలుస్తుంది. ఆప్ నేత విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లితో సహా మరికొందరి పేర్లు ఇందులో చేర్చినట్లు తెలుస్తుంది. అయితే ఇందులో మిగతా వారు ఎవరు అనేది ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది.

First published:

Tags: ACB, CBI, Delhi, Delhi liquor Scam

ఉత్తమ కథలు