హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం..నిందితునికి బెయిల్ మంజూరు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం..నిందితునికి బెయిల్ మంజూరు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితునిగా ఉన్న శరత్ చంద్ర రెడ్డికి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన నానమ్మ చనిపోయినందున అంత్యక్రియల్లో పాల్గొనాలని శరత్ చంద్రా పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు 14 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ. 2 లక్షల పూచికత్తు మీద నిందితునికి కోర్టు బెయిల్ ఇచ్చింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితునిగా ఉన్న శరత్ చంద్ర రెడ్డికి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన నానమ్మ చనిపోయినందున అంత్యక్రియల్లో పాల్గొనాలని శరత్ చంద్రా పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు 14 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ. 2 లక్షల పూచికత్తు మీద నిందితునికి కోర్టు బెయిల్ ఇచ్చింది.

Amarinder: మహారాష్ట్ర గవర్నర్‌గా కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌!

కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. విజయ్ నాయర్ రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ అధికారులు కీలక అంశాలను వెల్లడించారు. వివరాల ప్రకారం..ఢిల్లీలోని ప్రభుత్వ పెద్దలకు సుమారు రూ.100 కోట్లు అడ్వాన్స్ చెల్లింపులు చేసినట్లు తెలుస్తుంది. అలాగే పాలసీ తయారీలో విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ వెల్లడించింది.. అలాగే అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ కలిసి లంచాలు ఇచ్చారు. హోల్ సెలర్ల నుండి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటివరకు రూ.30 కోట్ల వరకు ఢిల్లీ పెద్దలకు డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ పాలసీ తయారీలో విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించారని రిపోర్ట్ లో తేలింది. పాలసీ తయారికి 2 నెలల ముందే విజయ్ నాయర్ చేతికి వచ్చినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి వివరాలను వాట్సప్ ద్వారా పంపించారని తెలుస్తుంది. అలాగే విజయ్ నాయర్ ఢిల్లీ ఉన్నతాధికారిగా చెప్పుకున్నట్లు సమాచారం.

16 ఏళ్లుగా అదే పని.. పెళ్లి రోజును వినూత్నంగా జరుపుకుంటున్న జంట.. ఎక్కడో తెలుసా..?

ఈ కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. ఈడీ, సీబీఐ దర్యాప్తుతో అనేక విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే ఈడీ, సీబీఐ తొలి ఛార్జ్ షీట్ లను దాఖలు చేయగా..అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. ఇక తాజాగా ఈ కేసులో మరో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఈడీ ఏకంగా 13,567 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా మొత్తం 12 మంది పేర్లను ప్రస్తావించింది. అయితే వారు ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా సౌత్ గ్రూప్ కు సంబంధించి అనేక విషయాలపై ఈడీ ప్రస్తావించినట్టు తెలుస్తుంది.

169 చోట్ల సోదాలు..34 మంది పాత్ర 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 169 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. ఇందులో 34 మంది పాత్ర బయటపడిందని ఈడీ వెల్లడించింది. లిక్కర్ స్కామ్ బయటకు రాగానే ఈ 34 మంది 140 ఫోన్లు మార్చినట్లు ఈడీ తెలిపింది.

First published:

Tags: Crime, Crime news, Delhi liquor Scam

ఉత్తమ కథలు