రేప్ కేసు వెనక్కి తీసుకో...బాధితురాలి నోట్లో విషం పోసిన నిందితులు

విషం తాగించడంతో సృహ కోల్పోయి రోడ్డుపై పడి ఉన్న బాలికను స్థానికులు గుర్తించారు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.

news18-telugu
Updated: January 13, 2019, 11:07 AM IST
రేప్ కేసు వెనక్కి తీసుకో...బాధితురాలి నోట్లో విషం పోసిన నిందితులు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: January 13, 2019, 11:07 AM IST
ఎన్నిచట్టాలు తెస్తున్నా... ఎన్ని శిక్షలు విధిస్తున్నా... అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిందితులకు కఠిన శిక్షలు పడటం లేదు. ఓ రేప్ కేసు బాధితురాలిపై మరోసారి దుర్మార్గులు దాడికి దిగారు. బాధిత బాలికను రేప్ కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఆమెతో విషం తాగించారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారక జిల్లాలో చోటు చేసుకుంది. ట్యూషన్ నుంచి వస్తున్న 17 ఏళ్ల బాధిత బాలికను బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు అడ్డగించారు. రేప్ కేసు వెనక్కి తీసుకోవాలంటూ హెచ్చరించారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ బెదిరింపులకు పాల్పడ్డాడరు. అందుకు ఆమె నిరాకరించడంతో బాలిక చేత బలవంతంగా విషం తాగించారు. ఆమె నోట్లో విషం పోసి అక్కడ్నుంచి పరారయ్యారు.

ద్వారాక జిల్లాల్లోని హస్త్‌సాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. విషం తాగించడంతో సృహ కోల్పోయి రోడ్డుపై పడి ఉన్న బాలికను స్థానికులు గుర్తించారు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో బాధితురాలు ప్రాణాపాయం నుంచి బయటపడింది. కేసును వెనక్కి తీసుకోవాలని, కోర్టులో తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దని నిందితులు బెదిరించినట్టు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాను అంగీకరించకపోవడంతో చేతులు పట్టుకుని బలవంతంగా నోట్లో విషం పోసినట్టు తెలిపింది. బాలిక కిడ్నాప్, అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన నిందితులు ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు బాలికకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు భద్రత కల్పించారు.

 

First published: January 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...