హోమ్ /వార్తలు /క్రైమ్ /

జంతువుల కన్నా హీనం.. బాలుడిపై సాముహిక అత్యాచారం.. ఆ తర్వాత..

జంతువుల కన్నా హీనం.. బాలుడిపై సాముహిక అత్యాచారం.. ఆ తర్వాత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi Horror: కొందరు వ్యక్తులు పశువుల కన్నా హీనంగా ప్రవర్తించారు. బాలుడిని బంధించి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

దేశ రాజధాని ఢిల్లీ లో షాకింగ్ ఘటన జరిగింది. ఇప్పటి వరకు మన దేశంలో అమ్మాయిలకే భద్రత లేదని నిరూపించే ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఇక తాజాగా, జరుగుతున్న ఘటనలతో అబ్బాయిలకు కూడా సరైన భద్రత కరువైందని తెలుస్తోంది. కొందరు కామాంధులు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. అబ్బాయిలపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీలో (Delhi)  జుగుప్సాకర సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. సీలంపూర్ లోని ప్రాంతంలో 12 ఏళ్ల బాలుడని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత.. అతడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలుడి నోట్లో గుడ్డలు కుక్కి అరవకుండా మరీ నీచపు పనులు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటన సెప్టెంబరు 22న జరిగింది. ఆలస్యంగావెలుగులోనికి వచ్చింది. బాలుడు ఇంట్లో షాక్ తో ఉండటంతో తల్లిదండ్రులు ఆరా తీశారు.

అప్పుడు జరిగిన దారుణాన్ని బాలుడు ఇంట్లో వారితో తెలిపాడు. బాలుడిని కిడ్నాప్ చేసి... సాముహిక అత్యాచారం చేశారని, ప్రైవేటు పార్ట్ లలో రాడ్ ను కూడా దింపినట్లు బాలుడు తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడు సరిగ్గామాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అతడి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది. కాగా, ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో తన 12 ఏళ్ల కుమారుడిపై క్రూరంగా ‘లైంగిక వేధింపులు’ జరిగాయని ఒక మహిళ నుంచి ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) ఫిర్యాదు అందింది.

ఇదిలా ఉండగా కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మానవమృగం చిన్నారిపై తన కామవాంఛ తీర్చుకున్నాడు.

9సంవత్సరాల బాలిక(9Year old girl)పై రెండు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ ఆమె అనారోగ్యానికి కారణమయ్యాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన రంగారెడ్డి (Rangareddy)జిల్లాలో కలకలం రేపింది. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ప్రవర్తించిన నిందితుడ్ని స్థానికులు పట్టుకొని చితకబాదారు. దేహశుద్ధి చేసి పోలీసు(Police)లకు అప్పగించారు.

బరితెగించిన కామాంధుడు..

జంటనగరాల పరిధిలో నిత్యం ఏదో ఓ మూల కామాంధులు బరితెగిస్తూనే ఉన్నారు. కామంతో కన్ను,మిన్ను కానరాకపోవడంతో పసివాళ్లు, చిన్నపిల్లను కూడా వదలడం లేదు. రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పొరుగు ఇంట్లో ఉంటున్న తొమ్మిది సంవత్సరాల బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. బ్రతుకు దెరువు కోసం బీహార్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌లో పని చేసుకుంటున్నాడు యువకుడు. రంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్న కామాంధుడి ఇంటి పక్కనే నివాసముంటున్న 9ఏళ్ల బాలికపై కన్నేశాడు. చిన్నారి తల్లిదండ్రులు పనుల మీద బయటకు వెళ్లినప్పుడల్లా ఇంట్లోకి చొరబడి ఆమెను బెదిరించి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈవిధంగా రెండు నెలల పాటు బాలికపై రాక్షసానందాన్ని పొందాడు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Delhi