Nirbhaya Case | నిర్భయ దోషుల ఉరిశిక్షపై మళ్లీ ట్విస్ట్...

నిర్భయ దోషులను ఉరిశిక్ష తీయాలన్న కేంద్రం పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్‌లో పెట్టింది.

news18-telugu
Updated: February 2, 2020, 7:39 PM IST
Nirbhaya Case | నిర్భయ దోషుల ఉరిశిక్షపై మళ్లీ ట్విస్ట్...
Nirbhaya Case : ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిర్భయ దోషులను ఉరిశిక్ష తీయాలన్న కేంద్రం పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. ఈనెల 1వ తేదీన నిర్భయ దోషులను ఉరితీయాల్సి ఉండగా, దాన్ని నిలుపుదల చేస్తూ పటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అనంతరం ఆ కేసుపై విచారణను నిరవధిక వాయిదా వేసింది. ఈ క్రమంలో ఉరిశిక్షను అమలు పదే పదే వాయిదా పడుతోందని, నిర్భయ దోషుల దృష్టిలో చట్టం దుర్వినియోగం అవుతోందని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ మీద రెండు రోజుల పాటు వాదనలు కొనసాగాయి. దీనిపై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలను వినిపించారు.

ఢిల్లీ హైకోర్టులో సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ఈ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాత తమ తీర్పును ప్రకటిస్తామని చెప్పారు. ‘నిర్భయ దోషులు ఉరి నుంచి తప్పించుకోవడానికి కావాలని, ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.’ అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.

మరోవైపు దోషులు పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఏకే సింగ్ మాత్రం భిన్నంగా తన అభిప్రాయాన్ని చెప్పారు. ‘ఈ కేసులోనే దోషులను ఉరి తీయాలనే ఆత్రుత ఎందుకు? సత్వర న్యాయం అంటే న్యాయాన్ని సమాధి చేయడమే’ అని వ్యాఖ్యానించారు. వారంతా గ్రామీణ ప్రాంతాల నుంచి ఢిల్లీకి ఉపాధి కోసం వచ్చిన దళితులని చెప్పారు. ముఖేష్, రామ్ సింగ్ ఇద్దరూ దళితులు అని చెప్పారు. రాజస్థాన్‌లోని ఓ మారుమూల పల్లె నుంచి ఢిల్లీకి వచ్చారని తెలిపారు. ఢిల్లీకి రావడం వారు చేసిన తప్పు అవుతుందా అని ప్రశ్నించారు. చట్టంలో ఉన్న సందిగ్ధతను వారిని ఎలా బలి చేస్తారని ప్రశ్నించారు. ముఖేష్ సింగ్ తరఫున వాదనలు వినిపించిన రెబెక్కా జాన్ మాట్లాడుతూ కింది కోర్టు ఉత్తర్వులను నేరుగా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలని గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రం విస్మరించిందన్నారు.

23 సంవత్సరాలు పారామెడికల్ స్టూడెంట్‌ను 2012 డిసెంబర్ 16న ఢిల్లీ వీధుల్లో అర్ధరాత్రి పూట బస్సులో తిప్పుతూ ఆరుగురు గ్యాంగ్ రేప్ చేశారు. అందులో ఒకరు మైనర్. గ్యాంగ్ రేప్‌తో పాటు చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె కొన్ని రోజుల తర్వాత సింగపూర్‌లో చికిత్స పొందుతూ చనిపోయింది. మైనర్ నిందితుడు కాకుండా, మిగిలిన ఐదుగురు నిందితుల్లో ఒకరైన రామ్ సింగ్ కేసు విచారణలో ఉండగానే తీహార్ జైల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

First published: February 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు