అత్యాచార కేసుల్లో సత్వర న్యాయం జరగాలని ఒకవైపు మహిళా సంఘాలు, కోర్టులు చెబుతుంటే పోలీసులు తీరు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఎఫ్ఐఆర్ లను దాఖలు చేయడంలో వాళ్లు వహిస్తున్న నిర్లక్ష్య వైఖరి నిందితులకు వరంగా మారింది. ఈ కేసులనుంచి వారు బయటపడటానికి అవకాశం దొరకుతున్నది. ఒక కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు ఎనిమిది గంటలు ఆలస్యమైనందుకు గానూ ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. ఈ కేసులో బాధితురాలి వయసు రెండున్నరేళ్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
దక్షిణ ఢిల్లీలోని ఒక ప్రాంతంలో నివాసముంటున్న నిందితుడు.. అదే ప్రాంతానికి చెందిన రెండున్నరేళ్ల పాపపై లైంగిక దాడికి యత్నించాడు. మత్తులో ఉన్న అతడు.. తన ప్యాంట్ జిప్ తీసి.. ఓరల్ సెక్స్ చేయమని ఆ పాపను బలవంత పెట్టాడు. అయితే ఈ సమయంలో అక్కడే ఉన్న స్థానికులు.. అతడిని చితకబాదారు.
ఆ పాప తల్లిదండ్రులు ఈ ఘటనకు సంబంధించి సంబంధిత పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాల్సిన పోలీసులు.. 8 గంటల పాటు ఆలస్యంగా కేసు దాఖలు చేశారు. అయితే నిందితుడు ఎటువంటి మత్తు పదార్థాలు తీసుకోలేదని.. అతడి శరీరంపై ఎటువంటి రాపిడి లేదని నిందితుడి తరఫున న్యాయవాది ఆరోపించాడు. తానేమీ నేరం చేయకున్నా.. ఇరుగు పొరుగువారు అతడ్ని కొట్టారని కూడా వాదించాడు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా సరైన విధంగా లేవు. సీసీటీవీ పుటేజీ కూడా లేకపోవడంతో కోర్టు పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అతడికి బెయిల్ మంజూరు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Delhi, Delhi High Court, High Court, Minor girl, RAPE