ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్ (Satyendar Jain) ను సోమవారం ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కాగా, ఆయన కోల్ కతాకు చెందిన ఒక కంపెనీకి సంబంధించిన లావాదేవీలలో అక్రమాలకు పాల్పడ్డారని, హవాల రూపంలో డబ్బులు సంపాదించారని ఈడీ అధికారులు ఆరోపించారు. సత్యేందర్ జైన్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంలో ఆరోగ్యం (Delhi Health Minister) , హోం, విద్యుత్, PWD, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి & వరదలు, నీటిపారుదల, నీటి శాఖ తదితర శాఖలకు మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన షకుర్‌బస్తీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈయన అరెస్టుతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నాయకులు, కావాలనే ఇలా చేస్తుందని ఆప్ నాయకులు మండిపడుతున్నారు.
సత్యేంద్ర జైన్ ఆమ్ ఆద్మీ పార్టీలో మొదటి నుంచి ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. అందుకే ఆయనకు కేజ్రీవాల్ కొన్ని ముఖ్యమైన శాఖలను ఆయనకు అప్పగించారు. ఆయన షాకూర్ బస్తీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. జైన్ కోల్ కతాకు చెందిన కంపెనీలో గుట్టుగా లావాదేవీలు సాగిస్తున్నట్లు ఈడీ ఆధారాలతో సహా గుర్తించింది. దీంతో ఆయనను సోమవారం రాత్రి ఆయన కార్యలయంలో దాడిచేసి అరెస్టు చేసింది. గతంలోనే ఆయనపై పలువురు హవాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. సత్యంద్ర జైన్ కేజ్రీవాల్ క్యాబినేట్ లో కీలక మంత్రిగా కొనసాగుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AAP, Delhi, Health minister