గర్ల్‌ఫ్రెండ్‌ తలలో బుల్లెట్లు దించిన బాయ్‌ఫ్రెండ్..

హత్యానంతరం ఆమె మృతదేహాన్ని ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడేసి పరారయ్యాడు. మార్గమధ్యలో ఓ క్యాబ్‌ని ఆపి అందులోకి ఎక్కాడు. తనను జైపూర్‌ తీసుకెళ్లాలని కారు డ్రైవర్‌ తలపై గన్ పెట్టి బెదిరించాడు.

news18-telugu
Updated: December 12, 2019, 3:24 PM IST
గర్ల్‌ఫ్రెండ్‌ తలలో బుల్లెట్లు దించిన బాయ్‌ఫ్రెండ్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీకి చెందిన అంతర్జాతీయ స్థాయి బాడీ బిల్డర్,జిమ్ ఓనర్ అయిన హేమంత్ లంబా..తన గర్ల్‌ఫ్రెండ్‌(22)ని గన్‌తో షూట్ చేసి హత్య చేశాడు. ఆమె తలలో గన్‌తో నాలుగుసార్లు కాల్చినట్టు పోలీసులు గుర్తించారు. హర్యానాలోని రెవారీ జిల్లాలో డిసెంబర్ 7న ఈ ఘటన జరిగింది. హత్యానంతరం ఆమె మృతదేహాన్ని ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడేసి పరారయ్యాడు. మార్గమధ్యలో ఓ క్యాబ్‌ని ఆపి అందులోకి
ఎక్కాడు. తనను జైపూర్‌ తీసుకెళ్లాలని కారు డ్రైవర్‌ తలపై గన్ పెట్టి బెదిరించాడు. అందుకు అతను నిరాకరించడంతో కాల్చి చంపేశాడు.

అనంతరం అదే కారులో గుజరాత్‌లోని వల్సద్‌కి వెళ్లిన హేమంత్.. అక్కడ ఓ డీలర్‌ని సంప్రదించి కారును అమ్మకానికి పెట్టాడు. అయితే హేమంత్ హడావుడి చూసి ఆ డీలర్‌కి సందేహం కలిగింది. కారుపై ఉన్న ఓ నంబర్‌కి ఫోన్ చేయగా.. క్యాబ్ డ్రైవర్ భార్య ఫోన్ ఎత్తింది. అసలు విషయం తెలిసిన ఆ డీలర్.. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. హుటాహుటిన అక్కడికి చేరుకుని అతన్ని అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Published by: Srinivas Mittapalli
First published: December 12, 2019, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading