కొందరు స్నేహం ముసుగులో యువతులకు మాయమాటలు చెబుతున్నారు. కొంత మంది మద్యం తాగించి అత్యాచారాలకు పాల్పడుతుంటారు. మరికొందరు.. తెలిసిన వారే కదా .. అని నమ్మి వేళ్తే.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కామాంధులు.. పసిపాప నుంచి పండు ముసలి వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ప్రతిరోజు మహిళలపై అఘాయిత్యాలకు చెందిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఈ కోవకు చెందిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
పూర్తి వివరాలు.. ఢిల్లీలో (Delhi) అమానవీయ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉన్న వసంత్ విహార్లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పదవ తరగతికి చెందిన బాలిక.. తన స్నేహితులతో సరదాగా గడపటానికి వెళ్లింది. వారంతా కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత.. బాలిక స్పృహలో లేనప్పుడు ఆమెను కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత.. ముగ్గురు స్నేహితులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే.. ఘటన తర్వాత.. బాలికను ఆమె ఇంటిదగ్గర వదిలేసి వెళ్లిపోయారు. అయితే, ఈ ఘటన జూలై 6 న జరిగింది.
బాలిక తీవ్ర భయాందోళనలకు గురవ్వడాన్ని ఇంట్లో వారు గమనించారు. ఈ క్రమంలో బాలిక జరిగిన దారుణాన్ని ఇంట్లో వారికి తెలిపింది. బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. బాలికను టెస్ట్ ల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా ఒక భర్త.. భార్యపై దారుణానికి పాల్పడ్డాడు.
పాకిస్థాన్ (Pakistan) లోని సింధ్ ప్రాంతంలో దారుణమైన ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న.. గుల్షన్-ఎ-ఇక్బాల్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్లోని వంటగదిలో జ్యోతిలో నర్గీస్ అనే మహిళ మృతదేహాన్ని బుధవారం పోలీసులు కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బజౌర్ ఏజెన్సీకి చెందిన మహిళ భర్త ఆషిక్.. పాఠశాలలో వాచ్మెన్గా పనిచేస్తూ ఎనిమిది నుంచి తొమ్మిది నెలలుగా మూతపడిన పాఠశాలలోని సర్వెంట్ క్వార్టర్లో నివసిస్తున్నాడు. అతనికి ముగ్గురు ఆడపిల్లలు. అయితే, అతను తన భార్యను పరాయి మగాళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకొవాలంటూ బలవంతం చేసేవాడు. దీనికి అతని భార్య.. జ్యోతిలో నర్గీస్ ఒప్పుకునేదికాదు. దీంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి.
ఈ క్రమంలో గత బుధవారం.. ముగ్గురు ఆడపిల్లల ముందే భార్య కాళ్ల చేతులు కట్టేసి.. కడాయిలో ఉడికించాడు. మరుగుతున్న నీళ్లలో భార్యను ముంచాడు. వేడికి తాళలేక.. ఆమె అక్కడే మరణించింది. ఈ దారుణ ఘటన తర్వాత ఆషిక్ తన ముగ్గురు పిల్లలతో కలిసి వేరే ప్రాంతానికి పారిపోయాడు. అయితే.. బాధితురాలి 15 ఏళ్ల కుమార్తె పోలీసులకు ఫోన్ చేసి జరిగిన దారుణాన్ని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Delhi