హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఢిల్లీలో షాకింగ్ ఘటన... క్లబ్ లో యువతి పట్ల బౌన్సర్ల అరాచకం.. బట్టలు చింపేసీ..

ఢిల్లీలో షాకింగ్ ఘటన... క్లబ్ లో యువతి పట్ల బౌన్సర్ల అరాచకం.. బట్టలు చింపేసీ..

బౌన్సర్ తో గొడవ పడుతున్న యువతి

బౌన్సర్ తో గొడవ పడుతున్న యువతి

Delhi: స్నేహితులతో సరదాగా క్లబ్ కు వెళ్లిన కొంత మంది యువతకి షాకింగ్ ఘటన ఎదురైంది. యువతి పట్ల బౌన్సర్లు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన దేశ రాజధానిలో తీవ్ర దుమారంగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) షాకింగ్ ఘటన సంభవించింది. కొంత మంది యువత.. తన స్నేహితుడి పార్టీకని స్థానికంగా ఉన్న సౌత్ ఎక్స్ టెన్షన్ పార్ట్1 ప్రాంతంలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. కాగా, కొంత మంది యువత క్లబ్ కు వెళ్లారు. అయితే.. అక్కడ ఎంట్రీ వద్ద బౌన్సర్లకు, వీరికి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త నెట్టుకొవడం వరకు వెళ్లింది. కొందరు బౌన్సర్లు యువతుల పట్లు దుర్భాషాలాడుతు.. వారిని దూరంగా తోసేశారు.

అంతే కాకుండా.. వారిని అసభ్యంగా తాకుతూ.. బట్టలను చింపేశారు. దీంతో షాకింగ్ కు గురైన వారు... వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చేరుకున్నారు. బాధిత యువతి.. తన బట్టలు చింపేసి, అసభ్యంగా తాకుతూ బౌన్సర్లు నీచంగా ప్రవర్తించారని పోలీసుల ఎదుట వాపోయింది. కాగా, బాధితుల నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఘటనపై అక్కడున్న వారినుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం క్లబ్ బయట ఉన్న సీసీ కెమెరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బాధితుల కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున క్లబ్ వద్దకు చేరుకుని తమ నిరసనలను తెలియజేస్తున్నారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. వెంటనే బౌన్సర్లపై తగిన చర్యలు తీసుకొవాలంటూ అధికారులను కోరుతున్నారు. కాగా, గతంలో కూడా ఢిల్లీలో క్లబ్ లు, రెస్టారెంట్ల లో బౌన్సర్లు, కస్టమర్లపై దాడులు చేసిన సంఘటనలు వార్తలలో నిలిచాయి.

ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని పూణెలో (Pune) దారుణమైన ఘటన జరిగింది.

ఒక యువతి జోమాటో ఫుడ్ యాప్ తో ఫుడ్ ఆర్డర్ పెట్టింది. అప్పుడు ఒక డెలివరీ బాయ్ వచ్చాడు. ఆమె సింగిల్ గా ఉండటాన్నిచూశాడు. తాగడానికి నీళ్లు ఇవ్వాలని కోరాడు. ఆమె ఇంట్లోకి వెళ్లగానే ఆమెనే ఫాలో అయ్యాడు. వెనుకవైపు నుంచి బలవంతంగా పట్టుకుని ఆమెకు ముద్దులు పెట్టాడు. అంతేకాకుండా అసభ్యంగా ప్రవర్తించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో యువతి షాకింగ్ లో ఉండిపోయింది. కాసేపటికి తెరుకుని మరో స్నేహితుడికి కాల్ చేసి జరిగిన దారుణాన్ని చెప్పింది.

దీంతో ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో జోమాటో డెలివరీ బాయ్ పై ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులకు ట్విస్ట్ ఎదురైంది. అఘాయిత్యానికి పాల్పడింది జోమాటో ఏజెంట్ కాదని తెలిసింది. కాగా, జోమాటో డన్జో యాప్‌తో డెలివరీని మార్చుకుంది. దీనిలో 39 ఏళ్ల రయీస్ షేక్ అనే వ్యక్తి రాత్రి 9.30 గంటల ప్రాంతంలో యువతి ఇంట్లో ప్రవేశించాడు. యువతి సింగిల్ గా ఉండటం గమనించాడు. వెంటనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Delhi

ఉత్తమ కథలు