Home /News /crime /

DELHI GANGSTER NEERAJ BAWANA WANTS IPOD NON VEG FOOD IN TIHAR JAIL CELL SB

నాకు నాన్‌వేజ్, ఐపాడ్ కావాలి... జైల్లో గ్యాంగ్‌స్టర్ డిమాండ్

తీహార్ జైలు (ఫైల్ ఫోటో)

తీహార్ జైలు (ఫైల్ ఫోటో)

తనకు జైలులో ఐపాడ్, ఎఫ్ఎం రేడియో, హోంమేడ్ మాంసాహార భోజనం అందించాలని ఓ కరడుకట్టిన గ్యాంగస్టర్ జైలు అధికారులను డిమాండు చేసిన ఉదంతం ఢిల్లీలోని తీహార్ జైల్లో వెలుగు చూసింది.

    సాధారణంగా జైలు జీవితం అంటేనే నరకంగా భావిస్తారు. జైల్లో అధికారులు చెప్పిన పని చేయాలి... పెట్టింది తినాలి. పెద్ద పెద్ద వివిఐపీలు మినహాయిస్తే... మిగతావాళ్లందరికి సాధారణ ట్రీట్ మెంటే ఉంటుంది. కానీ ఓ గ్యాంగస్టర్ మాత్రం తనకు జైల్లో అదీ ఇదీ కావాలని ఆర్డర్లు పురమాయిస్తున్నాడు. తనకు జైలులో ఐపాడ్, ఎఫ్ఎం రేడియో, హోంమేడ్ మాంసాహార భోజనం అందించాలని ఓ కరడుకట్టిన గ్యాంగస్టర్ జైలు అధికారులను డిమాండు చేసిన ఉదంతం ఢిల్లీలోని తీహార్ జైల్లో వెలుగు చూసింది. ఢిల్లీకి చెందిన నీతూ అలియాస్ బవానా కరడుకట్టిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్. భూకబ్జాలు, డబ్బు వసూళ్లు, హత్య, హత్యాయత్నం లాంటి 40 కేసుల్లో నిందితుడు. విదేశీ రివాల్వరుతో బెదిరించి పలు నేరాలకు పాల్పడిన నీరజ్ బవానాకు వందమంది అనుచరులు కూడా ఉన్నారు. వారిలో 40 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు.

    2015 ఏప్రిల్ నెలలో బవానాను అరెస్టు చేసి తీహార్ జైలులోని ప్రత్యేక గదికి తరలించారు. నీరజ్ బవానా డిమాండ్లు విన్న జైలు అధికారులు జైలు మాన్యువల్ ప్రకారం ఈ సౌకర్యాలు కల్పించలేమని స్పష్టం చేశారు. గతంలోనూ నీరజ్ బవానా టీవీ, టెలీఫోన్ సౌకర్యాలు కావాలని కోర్టును ఆశ్రయించారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Delhi, Jail, Police, Tihar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు