Delhi Firing : ఆప్ ర్యాలీలో కాల్పులు... కార్యకర్త మృతి

Delhi Firing : AAP గెలిచిన, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజే ఈ కాల్పుల ఘటన జరగడం కలకలం రేపింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.


Updated: February 12, 2020, 6:17 AM IST
Delhi Firing : ఆప్ ర్యాలీలో కాల్పులు... కార్యకర్త మృతి
Delhi Firing : ఆప్ ర్యాలీలో కాల్పులు... కార్యకర్త మృతి (File)
  • Share this:
Delhi Firing : ఢిల్లీలో రాత్రి జరిగిన కాల్పుల్లో ఆప్ కార్యకర్త అశోక్ మన్ చనిపోగా... మరొకరికి గాయాలయ్యాయి. ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ విజయోత్సవ ర్యాలీలో ఈ కాల్పులు కలకలం రేపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మెహ్‌రౌలీ నియోజకవర్గం నుంచీ గెలిచిన నరేష్ యాదవ్... విజయం తర్వాత ఓ గుడిలో దర్శనం చేసుకొని... అరుణా అసాఫ్ అలీ మార్గ్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎవరో దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కాల్పుల్ని ఆప్ తీవ్రంగా ఖండించింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి దుండగుల్ని పట్టుకోవాలని నరేష్ యాదవ్ కోరడంతో... FIR నమోదు చేసిన పోలీసులు... సీసీటీవీ పరిశీలిస్తున్నారు.


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్... 70 స్థానాల్లో 62 గెలుచుకోగా... బీజేపీ 8 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ ఇదివరకట్లాగే ఈసారి కూడా ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేకపోయింది.



First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు