Updated: February 12, 2020, 6:17 AM IST
Delhi Firing : ఆప్ ర్యాలీలో కాల్పులు... కార్యకర్త మృతి (File)
Delhi Firing : ఢిల్లీలో రాత్రి జరిగిన కాల్పుల్లో ఆప్ కార్యకర్త అశోక్ మన్ చనిపోగా... మరొకరికి గాయాలయ్యాయి. ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ విజయోత్సవ ర్యాలీలో ఈ కాల్పులు కలకలం రేపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మెహ్రౌలీ నియోజకవర్గం నుంచీ గెలిచిన నరేష్ యాదవ్... విజయం తర్వాత ఓ గుడిలో దర్శనం చేసుకొని... అరుణా అసాఫ్ అలీ మార్గ్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎవరో దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కాల్పుల్ని ఆప్ తీవ్రంగా ఖండించింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి దుండగుల్ని పట్టుకోవాలని నరేష్ యాదవ్ కోరడంతో... FIR నమోదు చేసిన పోలీసులు... సీసీటీవీ పరిశీలిస్తున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్... 70 స్థానాల్లో 62 గెలుచుకోగా... బీజేపీ 8 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ ఇదివరకట్లాగే ఈసారి కూడా ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేకపోయింది.
Published by:
Krishna Kumar N
First published:
February 12, 2020, 6:14 AM IST