• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • DELHI EIGHT MONTH PREGNANT DRUG QUEEN SHOT DEAD BY FOURTH HUSBAND CAPTURED IN CCTV SU

ఎనిమిది నెలల గర్భిణిని కాల్చి చంపిన నాలుగో భర్త.. సీసీటీవీలో దృశ్యాలు.. హత్య వెనుక ఆమె సోదరి హస్తం..?

ఎనిమిది నెలల గర్భిణిని కాల్చి చంపిన నాలుగో భర్త.. సీసీటీవీలో దృశ్యాలు.. హత్య వెనుక ఆమె సోదరి హస్తం..?

వసీమ్, సైనా

ఓ మహిళను ఆమె నాలుగో భర్త దారుణంగా హత్య చేశాడు. ఆ మహిళ జైలుకు వెళ్లిన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

  • Share this:
    ఓ మహిళను ఆమె భర్త హత్య చేశాడు. పట్టపగలే ఆమెను దారుణంగా కాల్చి చంపాడు. ఆమె 8 నెలల గర్భవతి అనే కనికరం లేకుండా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. బాధిత మహిళ డ్రగ్ వ్యాపారి అని, ఆమెను చంపింది నాలుగో భర్త అని పోలీసులు తెలిపారు. వివరాలు.. డ్రగ్ క్వీన్‌గా పేరున్న సైనా అనే మహిళ ఢిల్లీలోని హజ్రాత్ నిజమాముద్దీన్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. సైనా ఏడాది క్రితం వసీమ్ అనే వ్యక్తిని నాలుగో వివాహం చేసుకుంది. అయితే పెళ్లైనా కొద్ది రోజులకే ఆమెను డ్రగ్స్ సరఫరా కేసుకు సంబంధించి పోలీసులు సైనాను అరెస్ట్ చేశాడు. గర్భవతిగా ఉండటంతో ఇటీవలే సైనా బెయిల్‌పై విడులైంది. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భవతి.

    ఇక, సైనా మొదటి భర్త, రెండో భర్త ఆమెతో విడిపోయారు. అనంతరం వారు బంగ్లాదేశ్ వెళ్లిపోయారు. ఆమె మూడో భర్త షారాఫత్ షేక్.. డ్రగ్ డీలర్. డ్రగ్ సరఫరాతో పాటు గ్యాంగ్ స్టార్‌ అయిన షేక్‌ను పోలీసులు ఎన్‌పీడీఎస్ చట్టం కింద అరెస్ట్ చేశారు.

    సీపీటీవీలో కాల్పుల దృశ్యాలు..


    సైనా అరెస్ట్ అయిన తర్వాత వసీమ్.. ఆమె సోదరి రెహానాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే సైనా జైలులో నుంచి విడుదలైన తర్వాత వసీమ్, రెహానా బంధం ఇబ్బందుల్లో పడింది. ఈ క్రమంలోనే వసీమ్‌ సైనాతో పలుమార్లు గొడవ పడ్డాడు. రెహానాతో కలిసి జీవించాలని అనుకున్న వసీమ్.. సైనాను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే సైనా ఇంటికి వచ్చిన వసీమ్.. తన వెంట రెండు తుపాకులు తెచ్చుకున్నాడు.

    ఒక్కసారిగి సైనాపై కాల్పులు జరిపాడు. అయితే సైనా సర్వెంట్ ఆమెను కాపాడే ప్రయత్నం చేయగా.. అతనిపై కూడా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే సైనా మరణించింది. ఆమె సర్వెంట్‌ను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. వసీమ్ కాల్పులు జరిపిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

    7 ఏళ్ల వివాహ బంధం.. భార్యను ఆమె ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. కానీ ఆ క్షణంలో మాత్రం..

    ఇక, ఈ హత్య అనంతరం వసీమ్.. నేరుగా నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన తుపాకులను కూడా సమర్పించాడు. అయితే వసీమ్‌కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేకపోవడంతో.. ఈ ప్లాన్‌ను సైనా సోదరి రెహానా రూపొందించి ఉంటుందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సైనా డ్రగ్స్ వ్యాపారంలో కీలక సభ్యురాలు కావడంతో.. ఈ హత్య వెనక ఏమైనా కుట్ర ఉందా అనే యాంగిల్‌లో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published: