హోమ్ /వార్తలు /క్రైమ్ /

వెడ్డింగ్ కార్డ్స్‌లో రూ.15 కోట్ల డ్రగ్స్.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి రా? మీ తెలివి తగలెయ్య

వెడ్డింగ్ కార్డ్స్‌లో రూ.15 కోట్ల డ్రగ్స్.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి రా? మీ తెలివి తగలెయ్య

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Drugs seized in Delhi: వెడ్డింగ్ కార్డులను తెరిచి చూసిన అధికారులు.. తెల్లటి పొడిని నింపిన ప్యాకెట్లను గుర్తించారు. పొడిని ల్యాబ్‌కు తరలించి చెక్ చేస్తే.. హెరాయిన్‌గా తేలింది. అది నాణ్యమైన హెరాయిన్ అని అధికారులు చెప్పారు.

  దేశంలో డ్రగ్స్ ముఠాలు పెరుగుతున్నాయి. అధికారుల కళ్లు గప్పి విదేశాల నుంచి పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను దేశంలోకి తీసుకొస్తున్నారు. ఈ మధ్య దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై, హైదరాబాద్ వంటి మహానగరాల్లో డ్రగ్స్ వాడకం పెరిగింది. సెలబ్రిటీలు, సంపన్న కుటుంబాల పిల్లలు, కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ చేరవేసి.. కోట్లు దండుకుంటున్నారు. మనదేశంలో పట్టుబడుతున్న మాదక ద్రవ్యాల ముఠాలే ఇందుకు సాక్ష్యం. అధికారులు ఎంత నిఘా పెట్టినా.. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్ సరఫరా ఆగడం లేదు. కొత్త కొత్త మార్గాల్లో వాటిని తీసుకొస్తున్నారు. తాజాగా ఢిల్లీలో మరో డ్రగ్స్ ముఠా గుట్టును కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. వెడ్డింగ్ కార్డుల మాటున తరలిస్తున్న మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

  Shocking: దారుణం.. కదులుతున్న ఆటోలో యువతిపై ముగ్గురి అఘాయిత్యం

  విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను ఎయిర్‌పోర్టుల్లో తనిఖీ చేయడం సర్వసాధారణమైన విషయమే. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో (Delhi Airport) కూడా నిన్న కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను తనిఖీ చేశారు. కొందరు అక్రమ మార్గాల్లో బంగారం తరలిస్తూ పట్టుబడ్డారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. అందరిలాగే కెన్యా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని కూడా చెక్ చేశారు. అతడి వద్ద కొన్ని వెడ్డింగ్ గ్రీటింగ్ కార్డ్స్ (Wedding cards) కనిపించాయి. కస్టమ్స్ అధికారులకు మొదట పెద్దగా అనుమానం రాలేదు. కానీ ఎంతకైనా మంచిదని.. వాటిని చెక్ చేసేశారు. అంతే.. లోపల కళ్లు చెదిరే దృశ్యం కనిపించింది. వెడ్డింగ్ కార్డు లోపల భారీ మొత్తంలో హెరాయిన్ ఉండడంతో అధికారులు షాక్ తిన్నారు.

  OMG: రెచ్చిపోయిన ఎమ్మెల్యే కొడుకులు... ఫారెస్ట్ అధికారులపై పిడిగుద్దులు.. కారణం ఏంటంటే..

  కార్గో ఎక్స్‌పోర్టు ద్వారా హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఢిల్లీ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. వెడ్డింగ్ కార్డులను స్కానింగ్ చేస్తే లోపల డ్రగ్స్ ఉన్నట్లు తేలింది. కార్డు బోర్డు ప్యాకెట్లలో వెడ్డింగ్ కార్డులు ఉన్నాయి. ఆ వెడ్డింగ్ కార్డులను తెరిచి చూసిన అధికారులు.. తెల్లటి పొడిని నింపిన ప్యాకెట్లు (Drugs Smuggling in Wedding Cards)ను గుర్తించారు. పొడిని ల్యాబ్‌కు తరలించి చెక్ చేస్తే.. హెరాయిన్‌గా తేలింది. అది నాణ్యమైన హెరాయిన్ అని అధికారులు చెప్పారు. మొత్తం 5 ప్యాకెట్లలో 2.5 కిలోల హెరాయిన్ దొరికింది. బహిరంగ మార్కెట్లో దాని విలువ రూ.15 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ డ్రగ్స్‌ని ఎవరి కోసం తీసుకొస్తున్నారు? వాటిని పికప్ చేసుకునేందుకు ఎవరు వచ్చారు? ఈ ముఠా వెనక ఎవరెవరు ఉన్నారన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న కెన్యా దేశస్థులను విచారిస్తే..మరిన్ని కీలక విషయాలను వెల్లడయ్యే అవకాశముంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Delhi, Drugs, Drugs racket

  ఉత్తమ కథలు