ఉన్నావ్ రేప్ కేసు : దోషి కుల్దీప్‌కు నేడు శిక్ష విధించనున్న కోర్టు

కుల్దీప్ సెంగార్(File Photo)

ఉన్నావ్ రేప్ కేసులో దోషిగా తేలిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు ఢిల్లీ కోర్టు నేడు శిక్ష విధించనుంది.

  • Share this:
    ఉన్నావ్ రేప్ కేసులో దోషిగా తేలిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు ఢిల్లీ కోర్టు నేడు శిక్ష విధించనుంది. దోషికి క్యాపిటల్ పనిష్‌మెంట్(ఉరిశిక్ష) విధించాలని సీబీఐ ఇప్పటికే న్యాయస్థానాన్ని కోరింది. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను పరిగణలోకి తీసుకుని దోషికి శిక్ష విధించాలని కోరింది. ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ నేడు తీర్పు వెలువరించనున్నారు.

    కాగా, 2017లో ఓ మైనర్ బాలిక తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ ఎమ్మెల్యే కుల్దీప్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో కుల్దీప్‌ తన అనుచరులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే కుల్దీప్ తన పలుకుబడిని ఉపయోగించి కేసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాలిక బంధువును జైల్లో పెట్టించగా.. అతని లాకప్‌లోనే మృతి చెందాడు.మరో సందర్భంలో బాధిత బాలిక ప్రయాణిస్తున్న కారును లారీతో ఢీకొట్టించాడు. ఈ ప్రమాదంలో ఆమె బంధువులు ఇద్దరు చనిపోయారు.ఇలా కేసును అడ్డుకునేందుకు అతను అడుగడుగునా ప్రయత్నించాడు. అయితే బాధితురాలు న్యాయం కోసం బలంగా నిలబడటంతో ఎట్టకేలకు ఆమెకు న్యాయం జరగబోతోంది.
    Published by:Srinivas Mittapalli
    First published: