వరుసకు కూతురు అయ్యే యువతిపై అఘాయిత్యం.. అనంతరం భార్యతో కలిసి హత్య.. దేశ రాజధానిలో మరో దారుణం

చదువుకోవడానికి నగరానికి వచ్చిన ఓ అమ్మాయిపై వరుసకు బాబాయి అయ్యే వక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం భార్యతో కలిసి కడతేర్చాడు. అనంతరం ఇంట్లోనే శవాన్ని దాచి.. నేరాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు.

news18-telugu
Updated: November 3, 2020, 5:25 PM IST
వరుసకు కూతురు అయ్యే యువతిపై అఘాయిత్యం.. అనంతరం భార్యతో కలిసి హత్య.. దేశ రాజధానిలో మరో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశవ్యాప్తంగా యువతులపై రోజు రోజుకూ దాడులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు వావివరుసలను మరిచి కూతురు, అక్క, చెల్లి అయ్యే వారిపై సైతం ఆక‌ృత్యాలకు పాల్పడుతున్నారు. నిత్యం ఇలాంటి వార్తలు ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా చదువుకోవడానికి నగరానికి వచ్చిన ఓ అమ్మాయిపై వరుసకు బాబాయి అయ్యే వక్తే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం భార్యతో కలిసి కడతేర్చాడు. అనంతరం ఇంట్లోనే శవాన్ని దాచి.. నేరాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశాడు. చివరకు విషయం బయటపడడంతో భార్యాభర్తలిద్దరూ జైలు పాలయ్యారు. వివరాల ప్రకారం.. ఈశాన్య ఢిల్లీలోని నంద్‌నగరి ఏరియాలో వకీల్‌ పోదార్‌(51), అతడి భార్య నివసిస్తున్నారు. వకీల్ రిక్షా నడుపుతుండగా.. అతడి భార్య భిక్షమెత్తుకుంటుంది. అయితే వకీల్ వదిన కూతురు(17) ఉన్నత విద్యను అభ్యసించడానికి ఢిల్లీకి వచ్చి వీరి వద్దే ఉంది.

అయితే వకీల్ ఆ యువతిపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా అనుభవించాలని కుట్ర పన్నాడు. ఈ క్రమంలో భార్య భిక్షమెత్తుకోవడానికి వెళ్లిన సమయంలో ఆ యువతితో అనేక సార్లు అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఆ యువతి ప్రతిఘటించడంతో ఏమీ చేయలేకపోయాడు. అయితే ఓ రోజు ఆ యువతిపై దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు విషయాన్ని వకీల్ భార్యతో చెప్పింది. ఈ క్రమంలో వకీల్ కు, ఆయన భార్యకు మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆ యువతిని ఇంట్లో నుంచి పంపించాలని వకీల్ తో భార్య గొడవకు దిగింది. అయితే బయట ఏమీ తెలియని బాధితురాలు అక్కడ నుంచి వెళ్లిపోలేదు.

దీంతో ఆ యువతిని చంపడమే మన మధ్య వివాదాలకు పరిష్కారమని వకీల్ తో భార్య చెప్పింది. ఇందుకు ప్లాన్ చేసింది. గత నెల 23న వకీల్‌ ఆ యువతి తలపై ఇనుపరాడ్డుతో బలంగా కొట్టడంతో అక్కడిక్కడే చనిపోయింది. అనంతరం వకీల్, అతడి భార్య శవాన్ని బెడ్ కింద ఉండే బాక్స్ లో దాచిపెట్టారు. అయితే ఆ యువతి మిస్ అయినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ యువతిని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఓ అనాధాశ్రమానికి పంపించినట్లు భర్త తనకు చెప్పినట్లు నిందితుడి భార్య విచారణ సందర్భంగా పోలీసులకు చెప్పింది. అయితే దర్యాప్తులో ఆమె చెప్పింది అబ్ధమని తేలింది.

అదే సమయంలో నిందితుల ఇంటి నుంచి దుర్వాసన వస్తుందని పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ నిర్వహించగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న యువతి మృతదేహం లభ్యమైంది. నిందితురాలిని పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో విషయం మొత్తం చెప్పింది. శవాన్ని నగరానికి దూరంగా తీసుకెళ్లి తగలబెట్టాలని భావించామని వకీల్ భార్య పోలీసులకు తెలిపింది. అది కుదరకపోవడంతో వకీల్‌ బీహార్‌కు పారిపోయాడని వివరించింది. దీంతో పోలీసులు బీహార్ కు వెళ్లి నిందితుడి పట్టుకుని ఢిల్లీకి తీసుకువచ్చారు. ప్రస్తుతం నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు.
Published by: Nikhil Kumar S
First published: November 3, 2020, 5:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading