HOME »NEWS »CRIME »delhi cop booked for trying to extort rs 10 lakh from ghaziabad man su gh

Land Settlements: భూ కబ్జాలకు పాల్పడిన ఎస్‌ఐ అరెస్టు.. బాధితుడు ఫిర్యాదు చేయడంతో..

Land Settlements: భూ కబ్జాలకు పాల్పడిన ఎస్‌ఐ అరెస్టు.. బాధితుడు ఫిర్యాదు చేయడంతో..
ప్రతీకాత్మక చిత్రం

భూకబ్జాలకు పాల్పడుతున్న ఒక సబ్ ఇన్‌స్పెక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Share this:
భూకబ్జాలకు పాల్పడుతున్న ఒక సబ్ ఇన్‌స్పెక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. తాను కష్టపడి కొనుగోలు చేసిన ప్లాట్‌ను అమ్మకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తానని ఒక SI బెదిరించినట్లు నగరానికి చెందిన బాధితుడు వీరేంద్ర శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో దిల్లీ పోలీసు శాఖలో ఎస్‌ఐగా పనిచేస్తున్న సోమేంద్ర సింగ్, అతని భార్య, అనుచరులను ఘజియాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారు తన నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశారని బాధితుడు తెలిపాడు. వీరేంద్ర శర్మ 2020 ఆగస్టు 1న సాహిబాబాద్‌లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో 107 చదరపు మీటర్ల భూమిని కొనుగోలు చేశాడు. కొత్త ప్లాట్‌కు కాంపౌండ్ వాల్ కట్టించేందుకు సిద్ధమైన తరువాత SI, తన అనుచరులతో కలిసి వచ్చి నిర్మాణ పనులను ఆపేశారు. ప్లాట్‌ను తనకు అమ్మాలని SI అతడిని ఆదేశించాడు. అందుకు నిరాకరించడంతో బెదిరింపులు మెదలుపెట్టాడు.

ప్లాట్‌ అమ్మకపోతే రూ.10 లక్షలు ఇవ్వాలని SI తనను ఆదేశించినట్టు వీరేంద్ర శర్మ చెబుతున్నాడు. ‘నా ప్లాట్‌ను తనకు అమ్మాలని ఎస్‌ఐ కొన్ని రోజుల నుంచి బెదిరిస్తున్నాడు. నేను అమ్మనని చెప్పడంతో నామీద నకిలీ కేసులు పెట్టి జైలుకు పంపిస్తానంటున్నాడు. చెప్పినట్లు వినకపోతే ఎన్‌కౌంటర్ చేసి చంపేస్తానని భయపెట్టాడు’ అని బాధితుడు చెప్పాడు.



అక్రమ నిర్మాణాలు చేస్తున్నాడని వీరేంద్ర శర్మ, అతడి కుటుంబ సభ్యులపై ఎస్‌ఐ ఫిర్యాదు కూడా చేశాడు. అతడి దౌర్జన్యాలను బాధితుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఎస్‌ఐ సోమేంద్ర, అతడి భార్య అంజు, వారి ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై IPC సెక్షన్ 386 కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published:January 23, 2021, 13:40 IST

टॉप स्टोरीज