నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ స్పీడు పెంచింది. రాహుల్ గాంధీని (Rahul gandhi) తమ ప్రశ్నలతో ఈడీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మరోవైపు కరోనా నుంచి కొలుకున్న సోనియా గాంధీని (Sonia gandhi) కూడా తమ ఎదుట హజరుకావాలని ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నిరసలు తెలుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు నిరసనలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇక వీరి నిరసనలు అదుపు చేసే క్రమంలో పోలీసులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఢిల్లీలో జరిగిన నిరసనను అదుపు చేసేందుకు ప్రయత్నించిన మహిళా పోలీసుపై .. కాంగ్రెస్ నాయకురాలు ఉమ్మింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media) వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. ఢిల్లీలో (Delhi) కాంగ్రెస్ నాయకులు మరోసారి పోలీసుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. రాహుల్ గాంధీని ఈడీ విచారణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో.. కాంగ్రెస్ మహిళా మోర్చా అధ్యక్షురాలు నెట్టా డిసౌజా పాల్గొన్నారు. అయితే, ఈడీ కార్యలయం దగ్గర వీరిని అదుపు చేసు క్రమంలో.. మహిళ పోలీసులు వీరిని అదుపులోనికి తీసుకుని ప్రత్యేక వాహానంలో ఎక్కించారు. అప్పుడు తోపులాట జరిగింది.
#WATCH | Mahila Congress President Netta D'Souza spits at police personnel during a protest with party workers in Delhi against ED for questioning Congress leader Rahul Gandhi in the National Herald case. pic.twitter.com/cPBIntJq1p
— ANI (@ANI) June 21, 2022
ఈ క్రమంలో.. నెట్టా డిసౌజా.. పోలీసులను తిడుతూ.. మహిళ పోలీసులపై గాండ్రించి ఉమ్మారు. (Netta D Souza spits on police) వెంటనే మహిళా పోలీసులు షాక్ కు గురయ్యారు. అక్కడి నుంచి కాస్త వెనుక వైపు జరిగారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా (Viral) మారింది. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. కాసేపటికి దీనిపై నెట్టా డిసౌజా స్పందించారు. తన నోటిలో మట్టి పడిందని , అనుకోకుండా దాన్ని బయటకు ఉమ్మానని.. కానీ పోలీసులపై ఉమ్మాలని కాదని వివరణ ఇచ్చారు. తనకు పోలీసులంటే అపారమైన గౌరవ, మర్యాదలు ఉన్నాయని తెలిపారు.
అయితే, గతంలో కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి (Renuka Chowdhury) కూడా పోలీసు అధికారి చోక్కాను పట్టుకున్న ఘటన పై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో రేణుక కూడా.. కేవలం బ్యాలెన్స్ కోసం మాత్రమే పోలీసు చొక్కా పట్టుకున్నానని అన్నారు. కేవలం పదిహేను రోజుల వ్యవధిలో రెండోసారి కాంగ్రెస్ నాయకులు పోలీసుల పట్ల అగౌరవంగా ప్రవర్తించి వార్తలలో నిలిచారు. ఇప్పుడు ఈ ఘటన తో మరోసారి వైరల్ (Viral news) గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Enforcement Directorate, Rahul Gandhi, Sonia Gandhi, Viral Video