నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తున్నాం... సీఎం కేజ్రీవాల్‌కు ఈ-మెయిల్ బెదిరింపు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఇద్దరు పిల్లలు. కూతురు హర్షిత, కుమారుడు పులకిత్. పిల్లలిద్దర్నీ మీడియా టపడకుండా, రాజకీయాలకు దూరంగా పెంచుతున్నారు. 2014లో ఐఐటీజేఈఈ పాస్ అయిన హర్షిత ప్రస్తుతం ఢిల్లీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఇంజినీరింగ్ చదువుతుంది

news18-telugu
Updated: January 13, 2019, 5:05 PM IST
నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తున్నాం... సీఎం కేజ్రీవాల్‌కు ఈ-మెయిల్ బెదిరింపు
అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం
news18-telugu
Updated: January 13, 2019, 5:05 PM IST
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు అడుగడుగునా ఆందోళనలు, భయాలే ఎదురవుతున్నాయి. తాజాగా ఆయనకు ఓ మెయిల్ వచ్చింది. సాధారణంగా సమస్యలు పరిష్కారానికి సీఎం కార్యాలయానికి ఈ మెయిల్స్ వస్తుంటాయి. కానీ.. ఇప్పుడు వచ్చిన ఈమెయిల్ సీఎం కేజ్రీవాల్‌తో పాటు భద్రతా సిబ్బందిని సైతం పరుగులు పెట్టించింది. ఇంతకీ ఆ మెయిల్‌లో ఏముందంటే సీఎం కూతుర్ని కిడ్నాప్ చేస్తున్నామంటూ వార్నింగ్ వచ్చింది. మీ అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాం... మా నుంచి ఆమెను ఎలా రక్షించుకుంటావో చూస్తాం...అంటూ హెచ్చరిస్తూ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు గుర్తుతెలియిన వ్యక్తులు పంపిన ఈమెయిల్ కలకలం రేపింది. దీంతో సీఎం కేజ్రీవాల్.. సెక్యూరిటీ పరుగులు తీశారు. సీఎం ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం కూతురుకు కూడా సెక్యూరిటీ పెంచారు.

సీఎం కేజ్రీవాల్ కుటుంబసభ్యులు


ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఇద్దరు పిల్లలు. కూతురు హర్షిత, కుమారుడు పులకిత్. పిల్లలిద్దర్నీ మీడియా టపడకుండా, రాజకీయాలకు దూరంగా పెంచుతున్నారు. 2014లో ఐఐటీజేఈఈ పాస్ అయిన హర్షిత ప్రస్తుతం ఢిల్లీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఇంజినీరింగ్ చదువుతుంది. 2014లో ఓ వ్యక్తి తన ఫేస్ బుక్ ఎకౌంట్‌లో కేజ్రీవాల్ కుమార్తె హర్షితపై అసభ్యకర పోస్టు పెట్టాడు. దీంతో పోలీసులు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

సీఎం కేజ్రీవాల్ కూతురు హర్షిత్, కుమారుడు పులకిత్
జనవరి 9న ఈ-మెయిల్ వచ్చినట్టు చెప్పిన పోలీసులు దీనిని సైబర్ సెల్ విభాగానికి అందించినట్టు చెప్పారు. గతేడాది కూడా కేజ్రీవాల్‌కు ఇటువంటి హెచ్చరిక ఈ-మెయిల్స్ వచ్చాయి. అప్పట్లో ఆయనను చంపేస్తామని హెచ్చరించారు. అయితే, కేజ్రీవాల్ కుటుంబానికి హెచ్చరికలు రావడం ఇదే తొలిసారి కాదు. తాజాగా ఢిల్లీ సీఎంఓకు వచ్చిన ఈ మెయిల్‌తో పోలీసులు అలర్ట్ అయ్యారు ప్రాజెక్టివ్ సర్వీస్ ఆఫీసర్‌ని నియమించారు. మెయిల్ ఎక్కడ్నుంచి వచ్చింది? ఎవరు పంపారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఎవరు పంపారు.
Loading....
ఇవికూడా చదవండి:

దృశ్యం’ సినిమా చూసి హత్య... ప్రియురాలిని చంపేసిన బీజేపీ నేత... మృతదేహాన్ని పూడ్చేసి...

యాదాద్రి ఆలయంలోకి సూర్య కిరణాలు... ప్రత్యేక అద్దాల ఏర్పాటు
First published: January 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు