బురారీ ట్విస్ట్: 10 మంది ఆత్మహత్య...వృద్ధురాలు మాత్రం..

పెద్దావిడ నారాయణ్ దేవి ఎలా చనిపోయిందనేది ఇంకా కొలిక్కి రాలేదు. ఆమె మృతిపై పోస్టుమార్టం నివేదిక ఇంకా రాలేదని పోలీసులు తెలిపారు. దాని కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.

news18-telugu
Updated: July 11, 2018, 6:03 PM IST
బురారీ ట్విస్ట్: 10 మంది ఆత్మహత్య...వృద్ధురాలు మాత్రం..
భాటియా ఫ్యామిలీ
  • Share this:
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బురారీ మరణాలకు సంబంధించి పోస్టుమార్టం రిపోర్టు బయటకు వచ్చింది. భాటియా ఫ్యామిలో 11 మంది చనిపోగా.. వారిలో పది మంది ఉరివేసుకొని చనిపోయారని నివేదిక వెల్లడించింది. వారి శరీరాలపై ఎటువంటి గాయాలు లేవని..వారంత వారే ఉరేసుకున్నారని  డాక్టర్లు ధృవీకరించారు. హత్య అనుకోవడానికి.. ఎలాంటి ఆధారాలు దొరకలేదని స్పష్టం చేశారు.

ఐతే పెద్దావిడ నారాయణ్ దేవి ఎలా చనిపోయిందనేది ఇంకా కొలిక్కి రాలేదు. ఆమె మృతిపై పోస్టుమార్టం నివేదిక ఇంకా రాలేదని పోలీసులు తెలిపారు. దాని కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. కాగా, జులై 1న భాటియా ఫ్యామిలీలోని 11 మందిలో 10 మంది ఐరన్ మెష్‌కు ఉరివేసుకున్నారు. వారంతా ఒకే గదిలో చనిపోగా.. నారయణ్ దేవి డెడ్‌బాడీ మాత్రం పక్క గదిలో కనిపించింది. ఐతే వారి బంధువులు మాత్రం ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా, మృతుల్లో నారాయణ్ దేవీ(77)తో పాటు ఆమె కూతురు  ప్రతిభ (57), ఇద్దరు కుమారుడు భావనేశ్ (50), లలిత్ (45) ఉన్నారు. భావనేశ్ భార్య సవిత (48), వారి పిల్లలు నీతు (25), మనేకా (23), ధీరేంద్ర (15)  కూడా చనిపోయారు. లలిత్ భార్య టీనా (42), వారి కుమారుడు దుశ్యంత్ (15) సైతం ఉరివేసుకొని మరణించారు. ఇక గత నెలలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ప్రతిభ కూతురు ప్రియాంక కూడా సూసైడ్ చేసుకుంది.

వచ్చే దీపావళిని మీరు చూడరు: మరోవైపు ఆ ఇంట్లో మరో నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మలకు సంబంధించిన అంశాలు అందులో రాయబడి ఉన్నాయి.''ధన త్రయోదశిని ఇప్పటికే జరుపుకున్నారు. కొందరు చేసిన తప్పుల వలన మీరు ఏమీ సాధించలేకపోయారు. వచ్చే దీపావళిని బహుశా మీరు జరుపుకోకపోవచ్చు. హెచ్చరికలను పక్కనబెట్టకుండా శ్రద్ధ చూపండి.'' అని ఆ లేఖలో పేర్కొన్నారు.

First published: July 11, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...