హత్యకు పాల్పడ్డ 8 ఏళ్ల బాలుడు.. కారణం ఆ కక్షే..

డ్రైనేజ్‌లో ఆ పసిబాలుడి మృతదేహం లభించింది. కుడి కన్ను, పొత్తి కడుపు, కాలి భాగాల్లో గాయాలైనట్టు గుర్తించారు. కుడి చెవి నుంచి రక్తం కూడా కారుతున్నట్టు గుర్తించారు.

news18-telugu
Updated: April 30, 2019, 11:27 AM IST
హత్యకు పాల్పడ్డ 8 ఏళ్ల బాలుడు.. కారణం ఆ కక్షే..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 30, 2019, 11:27 AM IST
తన తమ్ముడిని కొట్టిందన్న కారణంతో ఎనిమిదేళ్ల ఓ బాలుడు.. పసిపిల్లవాడైన ఆమె సోదరుడిని హత్య చేశాడు. సౌత్ ఢిల్లీలోని ఫతేపూర్ బేరీలో సోమవారం ఈ ఘటన జరిగింది. కొద్ది రోజుల క్రితం ఆ బాలిక అతని సోదరుడిని కిందకు నెట్టేయడంతో తలకు స్వల్ప గాయమైందని.. దాన్ని మనసులో ఉంచుకుని ఆమెపై కక్ష పెంచుకున్న బాలుడు ప్రతీకారం తీర్చుకోవడానికి హత్యకు పాల్పడ్డాడని స్థానిక పోలీసులు తెలిపారు.సీనియర్ పోలీస్ అధికారి విజయ్ కుమార్ కథనం ప్రకారం.. శనివారం రాత్రి ఓ పసి బాలుడు మిస్ అయినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఇంటి మేడపై తల్లి, సోదరితో కలిసి నిద్రిస్తున్న సమయంలో.. అర్ధరాత్రి ఒంటిగంట-తెల్లవారుజామున 4గంటల మధ్యలో బాలుడు అదృశ్యమైనట్టు వారికి ఫిర్యాదు వచ్చింది.

అదే సమయంలో పొరుగునే అద్దె ఇంట్లో ఉండే మరో బాలుడు కూడా అదృశ్యమైనట్టు తెలిసింది. దీంతో పోలీసులు చుట్టుపక్కల వీరి కోసం గాలించగా.. డ్రైనేజ్‌లో ఆ పసిబాలుడి మృతదేహం లభించింది. కుడి కన్ను, పొత్తి కడుపు, కాలి భాగాల్లో గాయాలైనట్టు గుర్తించారు. కుడి చెవి నుంచి రక్తం కూడా కారుతున్నట్టు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని ఎయిమ్స్ మార్చురీకి తరలించారు.హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు పాల్పడ్డ బాలుడిని శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. జువైనల్ కోర్టు ముందు అతన్ని ప్రవేశపెట్టనున్నారు.


First published: April 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...