DELHI AUTO DRIVER KILLED WIFE HER BOYFRIEND HERE IS THE DETAILS VB
Neighbour Boy: తనకు ఇష్టంలేని పెళ్లి చేసినందుకు ఆమె ఏం చేసిందో చూడండి.. పక్కింటి యువకుడితో..
ప్రతీకాత్మక చిత్రం
Wife: ఆమెకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తల్లిదండ్రుల బలవంతంతో ఆమె ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఇలా ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఆ మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో వెలుగు చూసింది.
ఆమెకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ మంచి సంబంధం వచ్చింది. ఇలా ఆమెకు తల్లిదండ్రుల బలవంతంతో ఓ ఆటో డ్రైవర్ కు ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో ఆ రోజు నుంచి ఆమె అసహనంగానే ఉంది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎవరికీ చెప్పలేక పోయింది. అయినా కాపురం చేస్తూ తన జీవితాన్ని సాగిస్తున్నా.. తన భర్త మాత్రం ఇష్టం వచ్చినట్లు వేధించడం.. చేయి చేసకోవడం మొదలు పెట్టాడు. ఆమెకు విసుగు వచ్చింది. విసుగు నుంచి పుట్టుంది వివాహేతర సంబంధం. భర్తపై కోపంతో ఇంటి పక్కనే ఉంటున్న ఓ యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. భర్త లేని సమయంలో ఇంట్లోకి రమ్మని ఫోన్ చేసేది.
ఇలా ఆమె ఇంట్లో ఏకాంతంగా గడిపేవారు. కొన్నాళ్లు ఈ వ్యవహారం సాగించి.. తన భర్తను అడ్డు తొలగించాలని అతడికి చెప్పింది. తర్వాత మనం ఎక్కడికైనా వెళ్లిపోదాం అంటూ అతడికి చెప్పింది. అనుకున్నట్లుగా ఆమె ప్లాన్ ను తన ప్రేమికుడికి చెప్పి.. పక్కాగా తన భర్తను అతడి ద్వారా హత్య చేయించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో నివాసం ఉంటున్న ఊర్మిళ(20)ను.. ఆటో డ్రైవర్ రాజ్ కుమార్ కు ఇచ్చి పెళ్లి చేసేశారు పెద్దలు. అయితే ఆమెకు పెళ్లి అస్సలు ఇష్టం లేదు. పెళ్లి అయిన దగ్గర నుంచి ఆమె అసహనంగానే ఉంది. తన వివాహం పట్ల అసంతృప్తిగా ఉండేది. ఓ రోజు తన భర్త రాజ్ కుమార్ ఇంటికి వచ్చి.. ఎందుకు ఇలా ఉంటున్నావ్ అంటూ నిలదీశాడు. మరో రోజు చేయి చేసుకున్నాడు. ఇలా ప్రతీ రోజు ఆమెకు టార్చర్ చూపించడం మొదలు పెట్టాడు. ఇక ఆ వేధింపులను తట్టుకోలేక ఆమె ఇంటి పక్కనే ఉన్న ఖాన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఎలాగైన రాజ్ కుమార్ ను అడ్డు తొలగించాలని అతడికి చెప్పింది. దీంతో అతడు రాజ్ కుమార్ ను హత్య చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఓ రోజు అతడు రాజ్ కుమార్ ఆటో ఎక్కి.. మంగోల్‌పురి ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ Iకి వెళ్లాలని చెప్పాడు. రాజ్ కుమార్ కిరాయి వస్తుందనే ఆశతో ఖాన్ ను ఎక్కించుకొని ఆ ఏరియాకు తీసుకెళ్లాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఏకాంత ప్రదేశంలో ఆపమని అడిగాడు. ఎందుకు ఇక్కడ ఆపమన్నావ్ అంటూ.. అనే లోపే అతడు రాజ్ కుమార్ కాల్చి చంపేశాడు. అతడిని చంపడానికి కంట్రీ మేడ్ పిస్టల్‌ను తన వెంట తెచ్చుకున్నాడు.
అతడు రాజ్ కుమార్ వీపుపై కాల్పులు జరిపి అక్కడ నుంచి పారిపోయడు. రాజ్ కుమార్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. తన భర్తతో కలిసి జీవించడం ఇష్టం లేనందున ఖాన్ సహాయంతో అతన్ని చంపినట్లు ఊర్మిళ అంగీకరించినట్లు పేర్కొన్నాడు. పోలీసులు ఆ నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.