హోమ్ /వార్తలు /క్రైమ్ /

పోలీసులే షాక్.. 27 ఏళ్ల చోరీ జర్నీ.. 3 భార్యలు.. 5 వేల కార్ల దొంగతనాలు.. చివరకు..

పోలీసులే షాక్.. 27 ఏళ్ల చోరీ జర్నీ.. 3 భార్యలు.. 5 వేల కార్ల దొంగతనాలు.. చివరకు..

నిందితుడు అనిల్ చౌహాన్

నిందితుడు అనిల్ చౌహాన్

Delhi: కొన్నేళ్లుగా పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆటో డ్రైవర్ గా ఉంటునే, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి 5 వేలకు పైగా కార్లను చోరీ చేసి పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 5 వేలకు పైగా కార్లను దొంగిలించిన నిందితుడు "భారతదేశంలో అతిపెద్ద కార్ల దొంగ" అనిల్ చౌహాన్‌ను ఢిల్లీ (Delhi) పోలీసులు ఈరోజు సోమవారం అరెస్టు చేశారు. 52 ఏళ్ల అనిల్ ఢిల్లీ, ముంబై మరియు ఈశాన్య ప్రాంతాలలో ఆస్తులు కలిగి ఉన్నాడని, విలాసవంతమైన జీవనశైలిని కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రకారం.. అనిల్ చౌహాన్ దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగ అని, గత 27 ఏళ్లలో ఐదు వేలకు పైగా కార్లను దొంగిలించాడని పోలీసులు పేర్కొన్నారు. సెంట్రల్ ఢిల్లీ పోలీస్ స్పెషల్ స్టాఫ్ దేశ్ బంధు గుప్తా రోడ్ ఏరియా నుంచి పక్కా సమాచారంతో వెళ్లి వలపన్ని అతన్ని పట్టుకున్నారు. కాగా, అనిల్ ప్రస్తుతం ఆయుధాల స్మగ్లింగ్‌లో పాల్గొంటున్నాడు.

ఉత్తరప్రదేశ్ నుంచి ఆయుధాలను తీసుకెళ్లి ఈశాన్య రాష్ట్రాల్లోని నిషేధిత సంస్థలకు సరఫరా చేస్తున్నాడని ఆరోపించారు. అనిల్ గతంలో.. ఢిల్లీలోని ఖాన్‌పూర్ ప్రాంతంలో ఉంటూ ఆటోరిక్షాలు నడిపేవాడు. 1995 తర్వాత కార్లను దొంగిలించడం ప్రారంభించాడు. ఆ కాలంలో అత్యధికంగా మారుతీ 800 కార్లను దొంగిలించిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అనిల్ చౌహాన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో కార్లను దొంగిలించి నేపాల్, జమ్మూ కాశ్మీర్ , ఈశాన్య రాష్ట్రాలకు పంపి అక్కడ పార్ట్ లుగా తీసేసి అమ్మేవాడు. దొంగతనం సమయంలో కొందరు ట్యాక్సీ డ్రైవర్లను కూడా చంపేశాడని పోలీసులు తెలిపారు. అతను చివరికి అస్సాంకు వెళ్లి అక్కడ నివసించడం ప్రారంభించాడు. అక్రమంగా సంపాదించిన ఆస్తులతో ఢిల్లీ , ముంబై, ఈశాన్య రాష్ట్రాల్లో ఆస్తులు కూడబెట్టాడు.

ఇతడిపై దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. నిందితుడు అనిల్ అనేకసార్లు అరెస్టయ్యాడు. ఒకసారి 2015లో కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కలిసి ఐదేళ్లపాటు జైలులో ఉండి 2020లో విడుదలయ్యాడు. అతనిపై 180 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. అదే విధంగా.. అనిల్‌కు ముగ్గురు భార్యలు, ఏడుగురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. అతను అస్సాంలో ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా మారాడు. అక్కడి స్థానిక నాయకులతో టచ్‌లో ఉన్నాడు. అతని వద్ద నుంచి 6 పిస్టల్స్‌, ఏడు క్యాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

First published:

Tags: Crime news, Delhi

ఉత్తమ కథలు