హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు.. నిద్రలోనే విగతజీవిగా మారాడు.. అసలేం జరిగిందంటే..

OMG: ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు.. నిద్రలోనే విగతజీవిగా మారాడు.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi: అతనికి ఇద్దరు భార్యలు. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో గొడవలు ఎక్కువ కావడంతో మొదటి భార్య తన పిల్లలతో కలిసి వేరుగా ఉంటుంది.

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణం జరిగింది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉన్న రన్ హోలా ప్రాంతానికి చెందిన వీర బహదూర్ వర్మ అనే వ్యక్తకి 50 ఏళ్లు. అతనికి ఇద్దరు భార్యలు. అతను బిజినెస్ చేసుకుంటూ తన కుటుంబాలను పోషిస్తున్నాడు.ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆస్తికోసం కొన్ని రోజులుగా గొడవలు (Family disputes) జరుగుతున్నాయి. దీనితో మొదటి భార్య తన పిల్లలతో కలిసి నాంగ్లోయ్ ప్రాంతంలో ఉంటుంది. అయితే, వీరబహదూర్ వర్మ, రెండో భార్య చందా దేవితో కలిసి రన్ హోలా లోని అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు.

ఈ క్రమంలో వీరబహదూర్ వర్మ తన గదిలో రక్తపు మడుగులో ఉండటం ఆమె చూసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత మొదటి భార్యకు కూడా సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న మొదటి భార్య ఆస్తి కోసమే రెండో భార్య వీర బహదూర్ ను హతమార్చిందని ఆరోపించింది. అయితే, చందాదేవి మరో విధంగా ఉంది.

తన ఇంట్లో దొంగలుపడ్డారని డబ్బుల కోసం తన భర్తను దాడిచేసి హతమార్చారని చెప్పింది. దీని వెనుక మొదటి భార్య , ఆమె పిల్లల హస్తం ఉందని చెప్పింది. కాగా, పోలీసులు అక్కడి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అనుమానస్పదంగా చనిపొయినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ప్రియురాలు అవాయిడ్ చేస్తోందని యువకుడు, యువతిని గోవాలో హత్య చేశాడు.

ఇద్దరు కాలేజీ రోజుల నుంచి మంచి ఫ్రెండ్స్.  ఎక్కడికి వెళ్లిన కలిసి వెళ్లేవారు. కలసి ఎంజాయ్ చేసేవారు. ఎక్కువ సమయం ఇద్దరు కలిసి ఉండేవారు. ఈ క్రమంలో ఏమైందో కానీ.. ఆమె అతగాడిని దూరం పెట్టింది. ఈ ఘటన గోవాలో (Goa) జరిగింది. కలం గుట్కర్ (26) అనే యువకుడు, యువతిని ప్రేమించాడు. కాలేజ్ డేస్ నుంచి ఇద్దరు కలిసి ఉండేవారు. ఎక్కడికి వెళ్లిన కలిసే వెళ్లేవారు.

కొన్ని రోజుల నుంచి ఇతను ఫోన్ ను యువతి లిఫ్ట్ చేయట్లేదు. అవాయిడ్ చేస్తుంది.నీతో సంబంధం కొనసాగించడం (Affair)  ఇష్టం లేదని తేగేసి చెప్పింది. దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ తర్వాత.. ఆమెను ఎక్కడికైన తీసుకెళ్తే మారుతుందను కున్నాడు.

ఒక ప్లాన్ వేశాడు. గోవా తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు కలిసి వెల్సన్ బీచ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో కత్తితో ఆమెపై దాడిచేశారు. అక్కడే చంపేసి.. పొదల్లో వదిలేశాడు. స్థానికులు పొదల్లో శవం ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. అనుమానస్పద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Delhi, Family dispute, Murder

ఉత్తమ కథలు