స్టూడెంట్ గ్యాంగ్‌వార్.. బీరు బాటిళ్లతో కొట్టి డిగ్రీ విద్యార్థి హత్య

రేణిగుంట సమీపంలోనిలోని చదలవాడ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ డిగ్రీ చేస్తున్న ద్వారకనాథ్‌‌ను ఓ స్టూడెంట్ గ్రూప్ శెట్టిపల్లి రైల్వే గేటు వద్దకు పిలిపించారు.

news18-telugu
Updated: August 6, 2019, 10:32 AM IST
స్టూడెంట్ గ్యాంగ్‌వార్.. బీరు బాటిళ్లతో కొట్టి డిగ్రీ విద్యార్థి హత్య
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 6, 2019, 10:32 AM IST
బీరు బాటిళ్లతో డిగ్రీ విద్యార్థిని హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. రేణిగుంట సమీపంలో స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ నడిచింది. కడప జిల్లా రైల్వేకోడూరు కు చెందిన 20 ఏళ్ల ద్వారకనాథ్ అనే విద్యార్థిని హతమార్చారు. రేణిగుంట సమీపంలోనిలోని చదలవాడ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ డిగ్రీ చేస్తున్న ద్వారకనాథ్‌‌ను ఓ స్టూడెంట్ గ్రూప్ శెట్టిపల్లి రైల్వే గేటు వద్దకు పిలిపించారు. అనంతరం బీరు బాటిల్స్‌తో దాడి చేసి హతమార్చారు. కత్తులతో మెడపై పొడిచి దారుణంగా హత్య చేశారు. విద్యార్థుల మధ్య నెలకొన్న గొడవలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కడప జిల్లా కోడూరుకు చెందిన ద్వారకానాథ్‌ తల్లిదండ్రులు కువైట్‌లో ఉంటున్నారు. ఏడాదిన్నర క్రితం చదువుకునేందుకు తిరుపతికి వచ్చి శెట్టిపల్లిలో ఓ గదిని అద్దెకు తీసుకొని ద్వారకానాథ్ ఉంటున్నాడు. హత్యకు పాల్పడ్డ యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

First published: August 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...