హోమ్ /వార్తలు /క్రైమ్ /

డిగ్రీ విద్యార్థిని హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు.. చాటింగ్ లో ఆ మెసేజ్ ల వల్లే దారుణం..!

డిగ్రీ విద్యార్థిని హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు.. చాటింగ్ లో ఆ మెసేజ్ ల వల్లే దారుణం..!

అనూష, విష్ణువర్ధన్ రెడ్డి (ఫైల్ ఫొటోలు)

అనూష, విష్ణువర్ధన్ రెడ్డి (ఫైల్ ఫొటోలు)

నిందితుడు ఈ దారుణానికి తెగించడానికి కారణాలు ఏమై ఉంటాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఇప్పటికే కొన్ని నిజాలను రాబట్టారు. అటు మృతురాలి, ఇటు హంతకుడి ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.

గుంటూరు జిల్లాలో డిగ్రీ యువతి దారుణ హత్యకు గురవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఓ ప్రేమోన్మాది ఆమెను నమ్మించి, తన వెంట తీసుకెళ్లి ఆమె చున్నీతోనే గొంతుకు ఉరి బిగించి చంపేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి నేరం ఒప్పుకుని లొంగిపోయాడు. ఈ ఘటనతో నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థిలోకమంతా రోడ్డెక్కి నిందితుడిని నడిరోడ్డుపై ఉరితీయాలంటూ నినాదాలు చేశారు. దాదాపు తొమ్మిదిగంటల నిరసన తర్వాత సబ్ కలెక్టర్ హామీతో విద్యార్థులు ఆందోళన విరమించారు. కాగా, నిందితుడు ఈ దారుణానికి తెగించడానికి కారణాలు ఏమై ఉంటాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఇప్పటికే కొన్ని నిజాలను రాబట్టారు. అటు మృతురాలి, ఇటు హంతకుడి ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.

గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన కోట అనూష, బొల్లాపల్లి మండలం పమిడిపాడుకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి మధ్య కొన్నాళ్లుగా పరిచయం ఉంది. వీరిద్దరూ నరసరావుపేటలోని ఓ ప్రేవేటు కాలేజీలో చదువుకుంటున్నారు. కొన్నాళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారని కాలేజీ విద్యార్థులు చెబుతున్నారు. అయితే అనూష మరో యువకుడితో చనువుగా ఉంటోందని,  అతడితో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతూ, చాటింగ్ చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డికి అనుమానం వచ్చింది. రెండు రోజులుగా కాలేజీకి కూడా రాని విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం ఉదయం అనూషకు కాల్ చేశాడు. అప్పటికే అనూష కాలేజీకి ఆటోలో వెళ్తోంది. అయితే మాట్లాడాల్సి ఉందని, కలవాలని విష్ణు కోరాడు. దీంతో ఆమె కాలేజీకి వెళ్లకుండా అతడు చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఇద్దరూ కలిసి ఓ ఆటోలో నరసరావుపేట మండలం పాలపాడు వరకు వెళ్లారు. ఆ తర్వాత ఆటోను వెనక్కు పంపేశాడు.

ఇది కూడా చదవండి: నా భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు.. 54 రోజుల తర్వాత ట్విస్ట్.. బయటపడిన భార్య బండారం.. అసలేం జరిగిందంటే..

ఇద్దరూ సాగర్ కాలువ వరకు నడుచుకుంటూ వెళ్లారు. మాట్లాడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా విష్ణు ఆమె చున్నీని లాగేశాడు. అదే చున్నీతో ఆమెకు ఉరిబిగించి చంపేశాడు. కాలువ పక్కన ఉన్న చెత్తకుప్పలో ఆమె మృతదేహాన్ని కప్పెట్టాడు. ఆ తర్వాత నేరుగా నరసరావుపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతడు చెప్పిన వివరాలను బట్టి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తెలిసిన విద్యార్థి లోకం అతడిని ఉరి తీయాలంటూ నరసరావుపేట టౌన్ లో నిరసనకు దిగింది. ఆమె మృతదేహాంతో సహా నడిరోడ్డుపై బైఠాయించి నిందితుడిని అప్పగించాలని ధర్నా చేశారు. తొమ్మిదిగంటల పాటు ధర్నా చేసిన తర్వాత చివరకు డీఎస్పీ, సబ్ కలెక్టర్ హామీతో వారు దీక్ష విరమించారు. మృతురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం, రూ.10 లక్షల పరిహారం, ఇంటి స్థలం అందిస్తామని సబ్ కలెక్టర్ ప్రకటించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరతగితిన విచారణ జరిగి శిక్ష పడేలా చూస్తామన్నారు.

ఇది కూడా చదవండి: ప్రసవం తర్వాత ఒంటరిగా ఇంటికి.. పాప ఏదని భర్త నిలదీస్తే చనిపోయిందని చెప్పిన భార్య.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..!

కాగా, అదే కాలేజీలో చదివే మరో అబ్బాయితో అనూష చనువుగా ఉండటాన్ని విష్ణు భరించలేకపోయాడు. ఆ విషయంలోనే ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య ఫోన్ కాల్స్, మెసేజ్ ల రూపంలో వాగ్వాదం జరిగినట్టు, ఆమె మొబైల్ చాటింగ్ లో పంపించిన మెసేజ్ లు కూడా ఈ దారుణానికి కారణమయి ఉంటాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అనూష, విష్ణు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడాలని ముందునుంచే అనుకున్నాడని తెలుస్తోంది. రెండ్రోజులుగా కాలేజీకి రాని విష్ణు పక్కా ప్లాన్ తోనే ఆమెను బయటకు తీసుకెళ్లాడు. తనను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావంటూ ప్రశ్నించి క్షణికావేశంలో ఆమెను చంపేశాడు.

ఇది కూడా చదవండి: కుర్రాళ్లూ.. మొదటిసారి శృంగారంలో పాల్గొనబోయే ముందు.. ఈ 5 టిప్స్ తెలుసుకుంటేనే బెటర్..!

First published:

Tags: Andhra Pradesh, Couple affair, Crime news, Guntur

ఉత్తమ కథలు