వేధింపులు తాళలేక డిగ్రీ యువతీ ఆత్మహత్య

news18-telugu
Updated: September 13, 2018, 2:39 AM IST
వేధింపులు తాళలేక డిగ్రీ యువతీ ఆత్మహత్య
నమూనా చిత్రం
news18-telugu
Updated: September 13, 2018, 2:39 AM IST
కృష్ణా జిల్లా గంపలగూడెం కొణిజర్లలో డిగ్రీ విద్యార్థిని ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. ఈ యువతిని అదే ప్రాంతానికి చెందిన గోపి అనే యువకుడు కొంతకాలంగా వేధిస్తున్నాడు. బుధవారం కాలేజీ నుండి ఇంటికి వెళ్తున్న ఘాన్సీని దారిలోనే అడ్డగించి తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. అందుకు ఘాన్సీ నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన గోపి ఆమెపై చేయిచేసుకున్నాడు. అంతటితో ఆగకుండా చంపేస్తానని బెదిరించాడు.

ఈ ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన ఘాన్సీ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గోపీని చాలాసార్లు మందలించామని అయినా వెంటపడుతూ చివరకు తమ అమ్మాయిని పొట్టనపెట్టుకున్నాడని ఝాన్సీ తల్లిదండ్రులు రోదిస్తున్నారు. గోపీని కఠినంగా శిక్షించాలని యువతీ తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న గోపీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

First published: September 13, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...