Home /News /crime /

DEATH TOLL RISES TO 359 IN SRI LANKA BOMBINGS BS

Srilanka Blasts: 359కి చేరిన మృతుల సంఖ్య.. ఇప్పటి దాకా 58 మంది అరెస్టు

పేలుళ్లు జరిగిన ప్రార్థనాస్థలం

పేలుళ్లు జరిగిన ప్రార్థనాస్థలం

మరిన్ని దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్న సమాచారం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ ప్రధాని రనిల్‌ విక్రమసింఘే పిలుపునిచ్చారు.

    వరుస పేలుళ్లతో శ్రీలంకలో భీతావహ వాతావరణం నెలకొంది. ఘటనాస్థలాలు రక్తపుటేరులతో, ఆర్తనాదాలతో రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఈ పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. బుధవారం నాటికి మృతుల సంఖ్య 359కి చేరింది. అందులో విదేశీయులు 38 మంది ఉండగా, అందులో 10 మంది భారతీయులు ఉన్నట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాళ్లు, చేతులు విరిగి పోయి నరకం అనుభవిస్తున్నారు. కాగా, ఈ మారణ హోమానికి పాల్పడ్డ దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి మరో 18 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. దీంతో ఇప్పవరకు అరెస్టయిన వారి సంఖ్య 58కి చేరింది. కాగా, మరిన్ని దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్న సమాచారం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ ప్రధాని రనిల్‌ విక్రమసింఘే పిలుపునిచ్చారు.

    చర్చిలు, హోటళ్లను లక్ష్యంగా చేసుకొని తామే వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డామని ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, స్థానిక ఇస్లామిక్‌ అతివాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని శ్రీలంక రక్షణ శాఖ మంత్రి రువాన్‌ విజెవర్దనే తెలిపారు. మార్చి 15న న్యూజిలాండ్‌ మసీదుల్లో జరిగిన కాల్పులకు ప్రతీకారంగానే ఈ దాడులకు తెగబడ్డట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పేలుళ్ల వెనుక విదేశీ ఉగ్రవాద నెట్‌వర్క్‌ ప్రమేయం ఉండే అవకాశాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, దాడులకు సంబంధించి భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు శ్రీలంకను ముందే హెచ్చరించాయి. మూడు సార్లు ఆ దేశానికి హెచ్చరికలు జారీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ఈ విషయాన్ని శ్రీలంక ప్రధాని విక్రమసింఘే కూడా ధ్రువీకరించారు.
    First published:

    Tags: Columbo Bomb Blast, India, L, Sri Lanka, Sri Lanka Blasts

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు