నాసిక్ రోడ్డు ప్రమాదం: 20కి చేరిన మృతుల సంఖ్య

అతివేగంతో ఆటో, బస్సు ఒకదానికొకటి ఢీకొని.. అనంతరం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయాయి. నాసిక్‌లోని దియోలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.


Updated: January 28, 2020, 10:55 PM IST
నాసిక్ రోడ్డు ప్రమాదం: 20కి చేరిన మృతుల సంఖ్య
ఘటనా స్థలంలో సహాయక చర్యలు
  • Share this:
నాసిక్‌లో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య 20కి చేరింది. బావిలో ముందు ఆటో పడడం, దాని మీదే బస్సు పడిపోవడంతో ఆటోలో ఉన్న వారంతా నలిగిపోయారు. నీటిలో మునిగి ఊపిరాడక అందరూ చనిపోయారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అతివేగంతో ఆటో, బస్సు ఒకదానికొకటి ఢీకొని.. అనంతరం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయాయి. నాసిక్‌లోని దియోలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది చనిపోయారు. మరో 30 మందిని రెస్క్యూ సిబ్బంది, స్థానికులు బయటకు తీశారు. వారిలో పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు మాలెగావ్ నుంచి కల్వాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బావి లోతు 70 అడుగులు ఉండడంతో ప్రమాద తీవ్ర పెరిగిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాని వెల్లడించారు.

First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు