DEATH TOLL RAISED TO 7 IN MUMBAI HIGH RISE FIRE ACCIDENT 15 INJURED IN TARDEO BLAZE UPDATES MKS
Mumbai Fire Update: భారీ భవంతిలో అగ్నిప్రమాదం.. 7కు పెరిగిన మరణాలు.. ఆస్పత్రిలో మరో 15మంది..
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
ముంబై నగరంలో శనివారం చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సెంట్రల్ ముంబైలోని టార్డియోలో ప్రాంతంలో 20 అంతస్తుల భవంతిలో మంటలు చెలరేగిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 15 మంది గాయపడ్డారు..
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో శనివారం చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సెంట్రల్ ముంబైలోని టార్డియోలో ప్రాంతంలో గోవాలియా ట్యాంక్ వద్ద గాంధీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న 20-అంతస్తుల కమలా భవనంలోని 18వ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం (లెవల్ 3) సంభవించడంతో ఏడుగు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 27 మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో 13 ఫైర్ ఇంజన్లు ఉన్నాయని, ఐదు అంబులెన్స్‌లను మోహరించినట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. ఆ ప్రదేశాన్ని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే సందర్శించే అవకాశం ఉంది.
తొలుత 1904 నెంబరు ఫ్లాట్ లో మంటలు చెలరేగాయని, పొగ మొత్తం భవనానికి వ్యాపించిందని, పక్క ఫ్లాట్లకు కూడా అగ్నికీలలు వ్యాపించాయని, ఫైర్ సేఫ్టీ సిస్టమ్ ఉన్నప్పటికీ అవి సరిగా పనిచేయకపోవడంతో ప్రమాదం తీవ్రత పెరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. ఇళ్లలో విద్యుత్ వైర్లు పూర్తిగా కాలిపోయాయన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అపార్లమెంట్ లో చాలా మంది నిద్రలోనే ఉన్నారని తెలిపారు.
బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని, ఏడుగురు గాయపడిన వారిలో ఐదుగురు నాయర్ ఆస్పత్రిలో మరణించారని, భాటియా ఆస్పత్రిలో ఒకరు, కస్తూర్బా ఆసుపత్రిలో మరొకరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం భాటియా ఆసుపత్రిలో 13 మంది, నాయర్ ఆసుపత్రిలో ఇద్దరు, కస్తూర్బా ఆసుపత్రిలో ఒకరు చికిత్స పొందుతున్నారని బీఎంసీ అధికారి తెలిపారు. గాయపడిన 15 మందిలో 12 మంది జనరల్ వార్డ్ పరిస్థితిలో చేరారని, వారు నిలకడగా ఉన్నారని, ముగ్గురు క్లిష్టంగా ఉన్నారని, ఐసీయూలో ఉంచారని భాటియా ఆసుపత్రికి చెందిన డాక్టర్ టీనా తెలిపారు.
7 killed in a blaze at Mumbai high-rise, 15 people suffer injuries
Take a look at this ground report!#MumbaiFire@vinivdvc brings in all latest details.
18వ అంతస్తులో మంటలు చెలరేగిన వెంటనే, నివాసితులు తమ కుటుంబ సభ్యులతో బయటకు పరుగులు తీయడం ప్రారంభించారు. ఒక్కో అంతస్తులో కనీసం ఆరు ఫ్లాట్లు ఉంటాయి. మంటలు 18 మరియు 19 అంతస్తులను చుట్టుముట్టాయి మరియు కొంతమంది నివాసితులు అక్కడ చిక్కుకుపోయారని మరొక అధికారి తెలిపారు. కొంతమంది నివాసితుల ప్రకారం, అగ్నిప్రమాదం తర్వాత భవనంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భవనంలోని చాలా మంది నివాసితులు నిద్రలో ఉన్నారు. మంటలు చెలరేగాయి, అగ్నిమాపక చర్య ఇంకా కొనసాగుతోందని అధికారులు చెప్పారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.