DEATH THREATS WHEN HUSBAND EXTRA MARITAL AFFAIR QUESTIONED BY WIFE HUSBAND ARRESTED FOR BRIDE SUICIDE SSR
Newly Married: పెళ్లైన ఆరు నెలల తర్వాత భర్త గురించి ఆ నిజం తెలిసేసరికి తట్టుకోలేక..
స్వాతి (ఫైల్ ఫొటో)
కేరళలోని కొల్లాం జిల్లా చవారా గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల క్రితం ఆ జంటకు పెళ్లైంది. పెళ్లైన తర్వాత మరొక మహిళతో తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న విషయం భార్యకు తెలిసింది.
కొల్లాం: కేరళలోని కొల్లాం జిల్లా చవారా గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల క్రితం ఆ జంటకు పెళ్లైంది. పెళ్లైన తర్వాత మరొక మహిళతో తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న విషయం భార్యకు తెలిసింది. ఇదేంటని భర్తను నిలదీస్తే చంపేస్తానని బెదిరించాడు. భర్త ప్రేమకు దూరమవడమే కాకుండా చంపేస్తానని బెదిరిస్తుండటంతో ఆ వివాహిత తీవ్ర మనస్తాపానికి లోనైంది. 22 ఏళ్ల ఆ యువతి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. భర్త వివాహేతర సంబంధం భార్య నిండు ప్రాణాన్ని బలిగొంది. చనిపోయిన ఆ మహిళను పోలీసులు స్వాతిగా గుర్తించారు. ఆమె భర్త శ్యామ్ లాల్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.