• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • DEATH SENTENCE TO A MAN WHO KILLED HIS WIFE WITH PETROL WHILE SLEEPING DUE TO DOUBT ON HER IN VIJAYAWADA HSN

Vijayawada: విజయవాడలో భార్యను చంపిన భర్త.. రెండేళ్ల తర్వాత ఉరి శిక్ష విధిస్తూ తీర్పు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

Vijayawada: విజయవాడలో భార్యను చంపిన భర్త.. రెండేళ్ల తర్వాత ఉరి శిక్ష విధిస్తూ తీర్పు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

భార్య గర్భవతి అయిందని సంతోషించకుండా ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆ గర్భం తన వల్ల వచ్చింది కాదని, ఆమెకు వివాహేతర సంబంధం ఉందని ఆమె పుట్టింట్లో కూడా చెప్పుకొచ్చాడు. చివరకు..

  • Share this:
    గాఢ నిద్రలో ఉన్న గర్భిణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడో వ్యక్తి. మంటలు తాళలేక, బాధను భరించలేక ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్ది గంటలకే మరణించింది. ఈ దారుణానికి పాల్పడింది ఎవరో కాదు. కట్టుకున్న భర్తే. అనుమానం అనే పెనుభూతం అతడిని ఈ దారుణానికి పాల్పడేలా చేసింది. ఉద్యోగం సజ్జోగం ఏమీ లేకుండా, భార్య సంపాదన మీదే ఆధారపడి జల్సాలు చేసే ఆ భర్త ఈ ఘోరానికి ఒడిగట్టాడు. డబ్బును పుట్టింటి వాళ్ల కోసం ఖర్చు చేస్తోందన్న కోపం ఓ వైపు, ఆమెకు వివాహేతర సంబంధం ఉందేమోనన్న అనుమానం మరో వైపు ఈ నీచానికి ఒడిగట్టేలా చేశాయి. 2019వ సంవత్సరంలో విజయవాడలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో కోర్టు తుది తీర్పును ఇచ్చింది. అతడికి ఉరి శిక్షను ఖరారు చేస్తూ గురువారం తీర్పునిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    కృష్ణా జిల్లా కోడూరు మండలం లింగాయపాలెంకు చెందిన ముక్కు మోహనరావు అనే వ్యక్తికి ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. కొన్నాళ్లకు లబ్బీపేటలోని ఓ అద్దె ఇంట్లోకి మకాం మార్చారు. పెద్ద కుమార్తె శైలజ టిక్కిల్ రోడ్ లోని ఓ ప్రైవేటు స్కూల్లో ఉద్యోగం చేస్తోంది. అదే స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బత్తుల సుజిత్ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లయింది. పెళ్లయిన కొన్నాళ్లకే సుజిత్ ఉద్యోగం మానేశాడు. భార్య సంపాదనతోనే జల్సాలు చేయడం మొదలు పెట్టాడు. భార్య పూర్తి జీతాన్ని తనకు ఇవ్వకుండా పుట్టింటి కోసం ఖర్చు చేస్తోందని సుజిత్ కోపం పెంచుకున్నాడు. అదే సమయంలో తన ఇద్దరు చెల్లెళ్లకు, తమ్ముడికి కూడా ఆమె డబ్బులతోనే పెళ్లిళ్లు జరిగాయి. దీనికి తోడు ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందేమోనని అతడు అనుమానం పెంచుకున్నాడు.

    ఆమె గర్భవతి కూడా అవడంతో అతడి అనుమానం మరింత బలపడింది. ఆ గర్భం తన వల్ల వచ్చింది కాదని, ఆమెకు వివాహేతర సంబంధం ఉందని ఆమె పుట్టింట్లో కూడా చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ పుట్టింటి వాళ్లు ఆమెను నిలదీయకపోవడంతో సుజిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ రోజు తెల్లలవారుజామున శైలజ గాఢ నిద్రలో ఉండగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గర్భవతి అని కనికరం కూడా లేకుండా దారుణానికి తెగబడ్డాడు. తీవ్ర గాయాలతోనే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. 2019వ సంవత్సరంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సుజీత్ నేరం చేసినట్టు రుజువు కావడంతో గురువారం కోర్టు తుది తీర్పును వెల్లడించింది. సుజిత్ కు ఉరి శిక్ష విధించాలని తీర్పునిచ్చింది.
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు