ఉరి తీయాల్సిందే...చిన్నారిపై అత్యాచారం కేసులో దోషికి మరణశిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కథువా రేప్-మర్డర్ కేసులోనూ రెండు రోజుల క్రితం పఠాన్‌కోట్ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఆరుగురు దోషుల్లో ముగ్గురికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం..మరో ముగ్గురు పోలీసులకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

news18-telugu
Updated: June 13, 2019, 4:51 PM IST
ఉరి తీయాల్సిందే...చిన్నారిపై అత్యాచారం కేసులో దోషికి మరణశిక్ష
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 13, 2019, 4:51 PM IST
మహిళపై అఘాయిత్యం..! పసిపాపపై అత్యాచారం..! ఇలాంటి వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం. దేశంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పోస్కోలాంటి కఠిన చట్టాలు తెచ్చినా పసిమొగ్గలపై ఘోరాలు ఆగడం లేదు. ఇలాంటి దుర్మార్గులకు వణుకు పుట్టేలా రాజస్థాన్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన రాక్షసుడికి అల్వార్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. పసిపిల్లలపై జరిగే క్రూరమైన చర్యలను సహించేది లేదని..దోషులకు కఠిన శిక్షలు పడాల్సిందేని స్పష్టంచేసింది.

రాజ్‌కుమార్ అలియాస్ ధర్మేంద్ర అనే వ్యక్తి నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. 2015లో బెరూర్‌లో ఈ దారుణం జరిగింది. అప్పటి నుంచీ ఈ కేసుపై విచారణ జరుగుతోంది. ఇటీవలే విచారణ పూర్తిచేసి రాజ్‌కుమార్‌ని దోషిగా తేల్చిన న్యాయస్థానం..అతడికి మరణశిక్షను విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది.
కాగా, దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కథువా రేప్-మర్డర్ కేసులోనూ రెండు రోజుల క్రితం పఠాన్‌కోట్ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఆరుగురు దోషుల్లో ముగ్గురికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం..మరో ముగ్గురు పోలీసులకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఐతే కోర్టు తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర అంసతృప్తి వ్యక్తంచేశారు. తమ చిన్నారిని అంత క్రూరంగా చంపిన రాక్షుసులను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.

First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...