చిత్తూరు జిల్లా చిన్నారి వర్షిత హత్యాచార కేసులో దోషికి ఉరిశిక్ష

గత ఏడాది నవంబర్ 7న చిన్నారి వర్షిత దారుణ హత్యకు గురైంది. ఘటన జరిగిన రోజు నిందితుడు రఫీ మద్యం తాగి ఓ పెళ్లికి వెళ్లాడు.

news18-telugu
Updated: February 24, 2020, 4:25 PM IST
చిత్తూరు జిల్లా చిన్నారి వర్షిత హత్యాచార కేసులో దోషికి ఉరిశిక్ష
చిన్నారి వర్షిత, హంతకుడు రఫి
  • Share this:
చిత్తూరు జిల్లా చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషి అయిన రఫీకి ఉరిశిక్ష విధిస్తూ... న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాలో పోక్సో యాక్ట్ కింద ఖరారైన తొలి ఉరిశిక్ష ఇదే కావడం విశేషం. ఈ కేసుకు సంబంధించిన విచారణను చిత్తూరు పోలీసులు సీరియస్ గా తీసుకొని కేవలం వంద రోజుల్లో పూర్తి చేశారు. ఆరేళ్ల చిన్నారిని లారీ క్లీనర్‌ అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. నిందితుడిని అరెస్టు చేసి.. 17 రోజుల్లోనే పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో 41 మంది సాక్షులను పోలీసులు విచారించారు. ఇవాళ చిన్నారి హత్యాచార కేసులో కోర్టు తుది తీర్పు ఇచ్చింది. దోషికి మరణ శిక్ష విధించి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

గత ఏడాది నవంబర్ 7న చిన్నారి వర్షిత దారుణ హత్యకు గురైంది. ఘటన జరిగిన రోజు నిందితుడు రఫీ మద్యం తాగి ఓ పెళ్లికి వెళ్లాడు. అక్కడ భోజనాల దగ్గర ఐస్‌క్రీమ్ కోసం గొడవపడ్డాడు. వంటవాళ్ల దగ్గరకు వెళ్లి వారితోనూ గొడవపెట్టుకున్నాడు. అనంతరం చిన్నారి వర్షితను మాటల్లో పెట్టి తనతో పాటు తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరోజు సీసీటీవీలో కనిపించిన దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుడి ఊహాచిత్రాలు గీయించారు.

First published: February 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు