కేసీఆర్ ఇంట్లో కుక్క మృతి కేసులో ట్విస్ట్...

కుక్క చనిపోయినప్పుడు ఇద్దరు వెటర్నరీ డాక్టర్ల మీద కేసు నమోదు చేశారు. వారిపై పెట్టిన క్రిమినల్ కేసులను హైదరాబాద్ పోలీసులు ఉపసంహరించుకున్నారు.

news18-telugu
Updated: November 26, 2019, 2:54 PM IST
కేసీఆర్ ఇంట్లో కుక్క మృతి కేసులో ట్విస్ట్...
కుక్క (File)
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట్లో కుక్క చనిపోయిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుక్క చనిపోయినప్పుడు ఇద్దరు వెటర్నరీ డాక్టర్ల మీద కేసు నమోదు చేశారు. వారిపై పెట్టిన క్రిమినల్ కేసులను హైదరాబాద్ పోలీసులు ఉపసంహరించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో మొత్తం 9 కుక్కలు ఉంటాయి. అందులో 11 నెలల కుక్క సెప్టెంబర్‌లో చనిపోయింది. అయితే, వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ హైదరాబాద్ పోలీసులు ఇద్దరు వెటర్నరీ డాక్టర్లు రంజిత్, లక్ష్మి మీద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీని మీద పెద్ద దుమారం రేగింది. వెటర్నరీ డాక్టర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసింది. డాక్టర్ల మీద క్రిమినల్ కేసులు ఉపసంహరించాలని కోరింది. మరోవైపు కుక్క సాధారణ అనారోగ్యం వల్ల చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో వచ్చినట్టు తెలిసింది. దీంతో హైదరాబాద్ పోలీసులు వెటర్నరీ డాక్టర్ల మీద పెట్టిన క్రిమినల్ కేసులను ఉపసంహరించారు.

First published: November 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>