చర్లపల్లి జైలులో ఖైదీ మృతి.. ఏలా చనిపోయాడంటే..?

చర్లపల్లి సెంట్రల్ జైలులో ఓ ఖైదీ గుండెపోటుతో మృతిచెందాడు. అధికారులు ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మరణించారు.

news18-telugu
Updated: April 2, 2020, 12:44 PM IST
చర్లపల్లి జైలులో ఖైదీ మృతి.. ఏలా చనిపోయాడంటే..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ చర్లపల్లి జైలులో గుండెపోటుతో మృతిచెందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని అరాక్ జిల్లాకు చెందిన మార్చి 31న వాజీద్ అలీ(56)(ఖైదీ నంబర్ 4492)కి మధ్యాహ్నాం సమయంలో గుండెపోటు వచ్చింది. గమనించి జైలు అధికారులు అలీని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మ‌ృతిచెందాడు. వాస్తవానికి వాజీద్ అలీ ఉపాధి కోసం నగరానికి వచ్చి.. జహీరాబరాద్‌లో కూలీ పనులు చేసుకునే వాడని అధికారులు చెప్పారు. ఏడాది క్రితం బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్షపడడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా వారు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీలో పెట్టినట్టు జైలర్ రామకృష్ణ పేర్కొన్నారు.
First published: April 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading