హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG : రక్తసిక్తమైన కెనడా : సడెన్ గా వచ్చి కత్తులతో దాడులు..భారీగా మృతులు

OMG : రక్తసిక్తమైన కెనడా : సడెన్ గా వచ్చి కత్తులతో దాడులు..భారీగా మృతులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Deadly Stabbings in Canada : కెనడా(Canada)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సస్కాచెవాన్ ఫ్రావిన్స్ లో ఆదివారం ఇద్దరు దుండగులు పౌరులపై కత్తులతో దాడులకు(Stabbings) దిగారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Deadly Stabbings in Canada : కెనడా(Canada)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సస్కాచెవాన్ ఫ్రావిన్స్ లో ఆదివారం ఇద్దరు దుండగులు పౌరులపై కత్తులతో దాడులకు(Stabbings) దిగారు. సస్కాచెవాన్ లోని జేమ్స్ స్మిత్ క్రీ నేషన్‌,సాస్కటూన్‌కు ఈశాన్య ప్రాంతంలోని వెల్డన్ గ్రామంలో ఆదివారం ఈ కత్తిపోట్లు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో 10 మంది మరణించారు. దాదాపు 15మంది గాయపడ్డారు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ప్రకారం.. డామియన్ శాండర్సన్( 31), మరియు మైల్స్ శాండర్సన్(30)అనే ఇద్దరు వ్యక్తులు ఈ దాడలకు తెగబడినట్లు పోలీసులు అనుమానించారు. వీరి ఫొటోలను విడుదల చేశారు. హింసాత్మక దాడుల తరువాత ఈ ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు కెనడా పోలీస్ అధికారులు తెలిపారు. వెల్డన్ సమీపంలోని ఓ టౌన్‌లో మూలవాసి కమ్యూనిటీకి చెందిన వారిపై ఈ దాడులు జరిగాయని పోలీసులు తెలిపారు.

. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ కమిషనర్ రోండా బ్లాక్‌మోర్ మాట్లాడుతూ.. "ఈరోజు మా ప్రావిన్స్‌లో ఏమి జరిగింది అనేది చాలా భయంకరమైనది. పలు చోట్ల నుంచి కాత్తి దాడుల గురించి మాకు మొదటి కాల్ ఉదయం 5.40 గంటలకు వచ్చింది., ఆ తరువాత వరుసగా పలు చోట్ల నుంచి కత్తి దాడుల గురించి సమాచారం అందింది. కొంతమంది బాధితులను లక్ష్యంగా చేసుకొని నిందితులు ఈ దాడి చేశారని భావిస్తున్నాం, ఇతరులను యాధృచికంగా చంపేసి ఉంటారు. సస్కాచెవాన్‌లో 13 లొకేషన్‌లలో 10 మంది మృతదేహాలను గుర్తించామని పోలీసులు వివరించారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు నిందితులుగా గుర్తించాం. ఇద్దరు దుండగుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టాం"అని చెప్పారు. అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను ఎవ్వరిని దగ్గరకు రానివ్వద్దని, పరిచయం లేని వారికి తమ వాహనాల్లో లిఫ్ట్ ఇవ్వరాదని ప్రజలకు సూచనలు చేసినట్లు పోలీస్ కమిషనర్ రోండా బ్లాక్ మోర్ తెలిపారు. ప్రొవిన్షయల్ రాజధాని రెజీనాలో ఇద్దరు నిందితులు ఉన్నట్లు స్థానికుల నుంచి తమకు చివరిసారిగా సమాచారం అందిందని, దీంతో సరిహద్దు ప్రావిన్స్ లు మనితోబా, అర్బర్టా లలోనూ నిందితులకోసం గాలింపు చర్యలు మొదలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత 2,500 మంది జనాభా కలిగిన జేమ్స్ స్మిత్ క్రీ నేషన్ లోకల్ ఎమర్జెన్సీని ప్రకటించింది.

Biggest Asteroid : మరో 10 రోజుల్లో భూమిపై భారీ విధ్వంసం!

ఈ ఘటనపై కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో స్పందించారు. ఈ దాడులను "భయంకరమైన, హృదయ విదారకమైనది" అని జస్టిన్ ట్రూడో ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తూ, అధికారుల సూచనలను పాటించాలని స్థానిక ప్రజలను కోరారు.

First published:

Tags: Canada, Crime news, Stabbing