శ్రీకాకుళంలో దారుణ హత్య... టాయిలెట్లో మృతదేహం

ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఓ పాన్ షాప్ తలుపులకు, గచ్చుపై రక్తపు మరకలు కనిపించాయి. అక్కడి నుంచి టాయిలెట్ వద్దకు ఈడ్చుకొచ్చిన ఆనవాళ్లు కనిపించాయి.

news18-telugu
Updated: May 7, 2020, 7:32 PM IST
శ్రీకాకుళంలో దారుణ హత్య... టాయిలెట్లో మృతదేహం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్యచేసి మృతదేహాన్ని టాయిలెట్‌లో పడేసారు. పలాసలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పలాసలోని ఆర్టిసీ కాంప్లెక్స్‌లో ఉన్న టాయిలెట్‌లో ఓ మృతదేహం కనిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకొని పరిశీలించారు. జేబులో లభ్యమైన కాగితం ఆధారంగా మృతుడిని కవిటిపల్లికి చెందిన సాంబమూర్తి(40)గా పోలీసులు గుర్తించారు. మృతుడి పురుషాంగంతో పాటు శరీరం పలు చోట్ల గాయాలు కనిపించాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఓ పాన్ షాప్ తలుపులకు, గచ్చుపై రక్తపు మరకలు కనిపించాయి. అక్కడి నుంచి టాయిలెట్ వద్దకు ఈడ్చుకొచ్చిన ఆనవాళ్లు కనిపించాయి.

అతడిని దుండగులు అత్యంత పాశవికంగా హత్యచేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనావేస్తున్నారు. సాంబమూర్తి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. పలాసలోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రి ఫకీరు మరణించాడు. తల్లి జోగమ్మ కవిటిపల్లిలో ఉంటోంది. మృతుడికి వివాహం కాలేదని సమచారం. ఈ నేపథ్యంలో సాంబమూర్తిని ఎవరు హత్య చేసి ఉంటారన్నది అంతుచిక్కడం లేదు. మృతదేహం లభ్యమైన చోటుకు సమీపంలోనే సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయి ఉంటాయని భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
First published: May 7, 2020, 7:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading