నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తీవ్ర కలకలం రేగింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు షెడ్డులో మృతదేహం లభ్యమైంది. షెడ్డు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించగా.. గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. ఏ మాత్రం గుర్తు పట్టరానికి వీల్లేకుండా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. అది మగ మనిషి మృతదేహమని.. మృతుడి వయసు 30-40 ఏళ్ల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ మృతదేహం ఎవరిదన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
2018 సెప్టెంబర్ 14న నల్గొండ జిల్లా... మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. భార్య అమృతతోపాటు ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా... ఆస్పత్రి బయటే 24 ఏళ్ల ప్రణయ్‌ని కత్తులతో నరికి చంపారు. అమృత తండ్రి తిరునగరి మారుతీరావు... హంతకులకు సుపారి ఇచ్చి ప్రణయ్‌ని హత్య చేయించారు. ఈ కేసులో మారుతీరావు 7 నెలలుగా వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. అనంతరం గత ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌పై విడుదల బయట తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఆయన షెడ్డులో మృతదేహం లభ్యమవడం చర్చనీయాశమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Nalgonda