Lovers: మూడు రోజుల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న లవర్ కలలోకి వచ్చిందని చెప్పి..

ప్రేయసితో ఘన్‌శ్యామ్ (ఫైల్ ఫొటో)

ఒకరు నిజంగా, నిజాయతీగా ప్రేమిస్తే ఆ ప్రేమించిన మనిషి కోసం ఎంత రిస్క్ అయినా ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. సినిమాల్లో చాలా సందర్భాల్లో ప్రేమికుల మధ్య వినిపించే కామన్ డైలాగ్ ‘నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ’. కానీ.. ఈ మాటను ఓ నిజ జీవిత ప్రేమికుడు నిజం చేశాడు. కానీ.. కన్నవాళ్ల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకపోవడం శోచనీయం.

  • Share this:
    అజ్మీర్: ఒకరు నిజంగా, నిజాయతీగా ప్రేమిస్తే ఆ ప్రేమించిన మనిషి కోసం ఎంత రిస్క్ అయినా ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. సినిమాల్లో చాలా సందర్భాల్లో ప్రేమికుల మధ్య వినిపించే కామన్ డైలాగ్ ‘నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ’. కానీ.. ఈ మాటను ఓ నిజ జీవిత ప్రేమికుడు నిజం చేశాడు. కానీ.. కన్నవాళ్ల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకపోవడం శోచనీయం. చనిపోయిన ప్రేయసి తనకు కలలో కనిపించిందని.. ఇక తాను ఈ లోకంలో ఉండలేనని ఆత్మహత్యకు పాల్పడి కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తన ప్రేయసి రైలు కింద పడి చనిపోయిందన్న సంగతి తెలుసుకున్న ప్రియుడు అతను కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు కొద్ది క్షణాల ముందు రైల్వే ట్రాక్‌పై పడుకున్న సమయంలో ఆ యువకుడు తీసిన వీడియో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యువకుడి పేరు ఘన్‌శ్యామ్ మేఘ్‌వాల్. ఘన్‌శ్యామ్ చనిపోయే ముందు రైలు పట్టాలపై పడుకుని సెల్ఫీ వీడియో తీశాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాను తన ప్రేయసి దగ్గరకు వెళ్లిపోతున్నానని.. తమ రెండు కుటుంబాలను పోలీసుల కేసులతో ఇబ్బంది పెట్టవద్దని అతను కోరాడు.

    ఫోన్ కాల్ ద్వారా తనకు ఆ యువతి పరిచయమైందని.. అప్పటి నుంచి ఇద్దరం ప్రేమలో ఉన్నామని ఘన్‌శ్యామ్ చెప్పాడు. తనకు ఒక్కమాట కూడా చెప్పకుండా తన లవర్ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయిందని.. అందుకే తాను కూడా తన దగ్గరకు వెళ్లిపోతున్నానని వీడియోలో అతను మాట్లాడాడు. ఆమె లేకుండా, ఆమెతో మాట్లాడకుండా మూడు రోజులు ఉండటమే చాలా కష్టంగా అనిపించిందని.. తాను లేని ఈ లోకంలో ఒక్క క్షణం కూడా ఉండలేనని అతను వీడియోలో చెప్పాడు.

    ఇది కూడా చదవండి: Shocking Incident: ఇంట్లో ఉన్న ఈమెను చావు ఎంత దారుణంగా పలకరించిందో చూడండి..

    తన చావుకు ఎవరూ కారణం కాదని.. తన ప్రేయసి లేదన్న మనస్తాపంతోనే చనిపోతున్నానని వీడియోలో ఆ యువకుడు చెప్పుకొచ్చాడు. తాను చనిపోయిన తర్వాత తన చేతికి ఉన్న రింగ్‌ను, బ్రాస్‌లైట్‌ను ఇంట్లో ఇచ్చేయాలని కోరాడు. ఆ వీడియో వైరల్ కావడంతో.. చూసిన వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. అయితే.. అప్పటికే ఘన్‌శ్యామ్ రైలు కింద పడి చనిపోయాడు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
    Published by:Sambasiva Reddy
    First published: