నిజామాబాద్ జిల్లాలో 2 రోజులుగా చెట్టుకు వేలాడుతున్న మృతదేహం, దించకపోవడానికి కారణం...

ప్రతీకాత్మక చిత్రం

రెండు నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన మమత అనే మహిళ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న గంగాధర్ అనే వ్యక్తి నిన్న గ్రామంలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

  • Share this:
    నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య ఘటనలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రెండు నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన మమత అనే మహిళ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న గంగాధర్ అనే వ్యక్తి నిన్న గ్రామంలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టు నుంచి మృతదేహం కిందకు దించకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. మమత హత్య కేసులో అసలు నిందితులను వెంటనే అరెస్టు చేసి, రెండు కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, మహిళా సంఘాలు అక్కడే భైఠాయించారు. నిన్న పోలీసులు నచ్చజెప్పినా గ్రామస్తులు వినలేదు. దీంతో ఈరోజు ఆర్డీవో గ్రామానికి వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవారకు మృతదేహం తరలించేది లేదని డిమాండ్ చేస్తున్నారు.. రెండు రోజులుగా మృతదేహం చెట్టుకు అలాగే ఉంది. గ్రామంలో పోలీసులను భారీగా మోహరించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: